డేటా విధానం

ఈ విధానం Facebook, Facebook (Facebook ఉత్పత్తులు లేదా ఉత్పత్తులు) ద్వారా అందించబడే Instagram, Messenger మరియు ఇతర ఉత్పత్తులు మరియు విశేషాంశాలకు మద్దతివ్వడానికి మేము ప్రాసెస్ చేసే సమాచారం గురించి వివరిస్తుంది. మీరు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లలో అదనపు సాధనాలు మరియు సమాచారాన్ని కనుగొనవచ్చు.

మేము ఎటువంటి రకాల సమాచారాన్ని సేకరిస్తాము?

Facebook ఉత్పత్తులను అందించడానికి, మేము మీ గురించిన సమాచారాన్ని తప్పనిసరిగా ప్రాసెస్ చేస్తాము. మేము ఎటువంటి రకాల సమాచారాన్ని సేకరిస్తామనే విషయం మీరు మా ఉత్పత్తులను వినియోగించడంపై ఆధారపడి ఉంటుంది. మీరు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లను సందర్శించడం ద్వారా మేము సేకరించే సమాచారాన్ని ఎలా యాక్సెస్ చేయాలి మరియు తొలగించాలనే దాని గురించి మరింత తెలుసుకోవచ్చు.
మీరు మరియు ఇతరులు చేయగల మరియు అందించగల అంశాలు.
  • మీరు అందించే సమాచారం మరియు కంటెంట్. మీరు ఖాతాకు సైన్ అప్ చేయడం, కంటెంట్‌ని సృష్టించడం లేదా పంచుకోవడం మరియు ఇతరులకు సందేశం పంపడం లేదా కమ్యూనికేట్ చేయడం వంటివి చేసిన సందర్భాలతో సహా మా ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు కంటెంట్, కమ్యూనికేషన్‌లు మరియు మీరు అందించే ఇతర సమాచారాన్ని మేము సేకరిస్తాము. ఇందులో ఫోటో స్థానం లేదా ఫైల్‌ను సృష్టించిన తేదీ వంటి మీరు అందించే (మెటా డేటా వంటిది) కంటెంట్‌లోని లేదా దాని గురించిన సమాచారం ఉండవచ్చు. ఇందులో మేము అందించే విశేషాంశాల్లో మీకు కనిపించేవి కూడా ఉండవచ్చు, మా కెమెరా వంటివి, కాబట్టి మేము మీరు ఇష్టపడగల మాస్క్‌లు మరియు ఫిల్టర్‌లను సూచించడం లేదా పోర్ట్రెయిట్ మోడ్‌ను ఉపయోగించి మీకు చిట్కాలను అందించడం చేయవచ్చు. దిగువ వివరించిన కారణాల రీత్యా సందర్భాన్ని మరియు వాటిలో ఏమి ఉందో విశ్లేషించడానికి మీరు మరియు ఇతరులు అందించిన కంటెంట్ మరియు కమ్యూనికేషన్‌లను మా సిస్టమ్‌లు స్వయంచాలకంగా ప్రాసెస్ చేస్తాయి. మీరు పంచుకునే అంశాలను ఎవరు చూడాలనే విషయాన్ని నియంత్రించడం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
    • ప్రత్యేక రక్షణలతో డేటా: మీరు మీ Facebook ప్రొఫైల్ ఫీల్డ్‌లలో లేదా జీవిత సంఘటనలలో మీ మతపరమైన దృక్పథాలు, రాజకీయ దృక్పథాలు, "ఆసక్తి" ఉన్న వ్యక్తులు లేదా మీ ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించడానికి ఎంచుకోవచ్చు. ఈ సమాచారం మరియు ఇతర సమాచారం (జాతి లేదా జాతి మూలం, తాత్విక విశ్వాసాలు లేదా వాణిజ్య సంఘ సభ్యత్వం వంటివి) EU చట్టాలను అనుసరించి ప్రత్యేక రక్షణలకు లోబడి ఉండవచ్చు.
  • నెట్‌వర్క్‌లు మరియు అనుసంధానాలు. మీరు అనుసంధానమైన వ్యక్తులు, పేజీలు, ఖాతాలు, హ్యాష్‌ట్యాగ్‌లు మరియు గ్రూపుల గురించి, అలాగే మా ఉత్పత్తుల్లో మీరు వారితో పరస్పర చర్య చేసే విధానం గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము, మీరు అత్యంత ఎక్కువగా కమ్యూనికేట్ చేసే వ్యక్తులు లేదా మీరు సభ్యులుగా ఉన్న సమూహాల వంటివి. అలాగే మీరు అప్‌లోడ్ చేయడానికి, సమకాలీకరించడానికి లేదా పరికరం నుండి దాన్ని దిగుమతి చేయడానికి ఎంచుకుంటే (చిరునామా పుస్తకం లేదా కాల్ లాగ్ లేదా SMS లాగ్ చరిత్ర వంటివి) మేము సమాచారాన్ని సేకరిస్తాము, దీన్ని మేము మీకు తెలిసి ఉండగల వ్యక్తులను కనుగొనడానికి మరియు దిగువ పేర్కొన్న ఇతర ప్రయోజనాల కోసం మీకు మరియు ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తాము.
  • మీ వినియోగం. మీరు మా ఉత్పత్తులను వినియోగించే విధానం గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము, మీరు వీక్షించే లేదా పరస్పర చర్చ చేసే కంటెంట్ రకాలు; మీరు వినియోగించే విశేషాంశాలు; మీరు తీసుకునే చర్యలు; మీరు పరస్పరం కలిసే వ్యక్తులు లేదా ఖాతాలు; మరియు మీ కార్యాచరణల సమయం, తరచుదనం మరియు వ్యవధి వంటివి. ఉదాహరణకు, మీరు మా ఉత్పత్తులను ఎప్పుడు వినియోగించారు మరియు చివరిగా ఉపయోగించిన మా ఉత్పత్తులు మరియు మా ఉత్పత్తులలో మీరు ఏ పోస్ట్‌లు, వీడియోలు మరియు ఇతర కంటెంట్‌ని వీక్షించారు అన్న మేము నమోదు చేస్తాము. మేము మా కెమెరా వంటి ఫీచర్‌లను మీరు ఎలా ఉపయోగించారనే దాని గురించి సమాచారాన్ని కూడా సేకరిస్తాము.
  • మా ఉత్పత్తుల్లో నిర్వహించిన లావాదేవీల గురించిన సమాచారం. మీరు కొనుగోళ్లు లేదా ఇతర ఆర్థిక లావాదేవీల (గేమ్‌లో భాగంగా కొనుగోలు చేయడం లేదా విరాళం ఇవ్వడం వంటి సందర్భాలలో) కోసం మా సేవలను ఉపయోగిస్తే, ఆ కొనుగోలు లేదా లావాదేవీ గురించి మేము సమాచారాన్ని సేకరిస్తాము. ఇందులో మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సంఖ్య మరియు ఇతర కార్డ్ సమాచారం; ఇతర ఖాతా మరియు ప్రామాణీకరణ సమాచారం; మరియు బిల్లింగ్, షిప్పింగ్ మరియు సంప్రదింపు వివరాల వంటి చెల్లింపు సమాచారం ఉంటుంది.
  • ఇతరులు చేసే పనులు మరియు వారు మీ గురించి అందించే సమాచారం. ఇతర వ్యక్తులు మా ఉత్పత్తులను ఉపయోగిస్తున్నప్పుడు కంటెంట్‌ను, కమ్యూనికేషన్‌లను మరియు సమాచారాన్ని స్వీకరించి, విశ్లేషిస్తాము. ఇందులో మీ గురించిన సమాచారం ఉండవచ్చు, మీ ఫోటోను ఇతరులు ఎప్పుడు పంచుకున్నారు లేదా దానిపై వ్యాఖ్యానించారు, మీకు సందేశం ఎప్పుడు పంపారు లేదా మీ సంప్రదింపు సమాచారాన్ని ఎప్పుడు అప్‌లోడ్ చేసారు, సమకాలీకరించారు లేదా దిగుమతి చేసారు వంటివి.
పరికర సమాచారం
దిగువ వివరించిన విధంగా, మా ఉత్పత్తులతో ఏకీకృతం చేసేందుకు మీరు వినియోగించే కంప్యూటర్‌లు, ఫోన్‌లు, అనుసంధానించిన టీవీలు మరియు ఇతర వెబ్ అనుసంధానిత పరికరాల నుండి మరియు వాటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తాము మరియు మీరు ఉపయోగించే విభిన్న పరికరాల్లో ఈ సమాచారాన్ని మేము చేర్చుతాము. ఉదాహరణకు, మీరు మీ ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ వంటి మరొక పరికరంలో మా ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు మీకు కనిపించే కంటెంట్‌ను (ప్రకటనలతో సహా) లేదా విశేషాంశాలను ఉత్తమంగా వ్యక్తిగతీకరించడానికి లేదా మేము మీకు మీ ఫోన్‌లో చూపిన ప్రకటనకు సంబంధించి మీరు వేరొక పరికరంలో చర్య తీసుకున్నారేమో అంచనా వేయడానికి మీ ఫోన్‌లో మా ఉత్పత్తులను మీరు వినియోగించే విధానానికి సంబంధించి సేకరించిన సమాచారాన్ని ఉపయోగిస్తాము.

ఈ పరికరాల నుండి మేము సేకరించే సమాచారంలో ఇవి ఉంటాయి:

  • పరికర లక్షణాలు: ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ సంస్కరణలు, బ్యాటరీ స్థాయి, సిగ్నల్ బలం, అందుబాటులోని నిల్వ, బ్రౌజర్ రకం, యాప్ మరియు ఫైల్ పేర్లు మరియు రకాలు, అలాగే ప్లగిన్‌ల వంటి సమాచారం.
  • పరికరం చర్యలు: పరికరంలో నిర్వహించిన చర్యలు మరియు ప్రవర్తనల గురించిన సమాచారం, విండో ముందువైపు ఉండాలా లేదా నేపథ్యంలో ఉండాలా లేదా మౌస్ కదలికల వంటివి (బోట్‌లకు, మనుషులకు వ్యత్యాసాన్ని తెలుసుకోవడంలో సహాయపడతాయి).
  • గుర్తింపు సాధనాలు: ప్రత్యేక ఐడెంటిఫైయర్‌లు, పరికర IDలు మరియు మీరు వినియోగించే గేమ్‌లు, యాప్‌లు లేదా ఖాతాల నుండి ఇతర ఐడెంటిఫైయర్‌లు, అలాగే కుటుంబ పరికరం IDలు (లేదా అదే పరికరం లేదా ఖాతాతో అనుబంధించబడిన Facebook సంస్థ ఉత్పత్తులకు ప్రత్యేకించబడిన ఇతర ఐడెంటిఫైయర్‌లు).
  • పరికరం సిగ్నల్‌లు: బ్లూటూత్ సిగ్నల్‌లు మరియు సమీపంలోని Wi-Fi యాక్సెస్ పాయింట్లు, బీకాన్‌లు మరియు సెల్ టవర్‌ల గురించిన సమాచారం.
  • పరికరం సెట్టింగ్‌ల నుంచి డేటా: మీరు ఆన్ చేసిన పరికరం సెట్టింగ్‌ల నుంచి స్వీకరించడానికి మీరు మాకు అనుమతి ఇచ్చిన సమాచారం, మీ GPS స్థానం, కెమెరా లేదా ఫోటోలకు యాక్సెస్ వంటిది.
  • నెట్‌వర్క్ మరియు అనుసంధానాలు: మీ మొబైల్ ఆపరేటర్ లేదా ISP పేరు, భాష, టైమ్ జోన్, మొబైల్ ఫోన్ నంబర్, IP చిరునామా, అనుసంధాన వేగం వంటి సమాచారం మరియు కొన్ని సందర్భాల్లో, సమీపంలోని లేదా మీ నెట్‌వర్క్‌లోని ఇతర పరికరాల గురించిన సమాచారం, దీని వల్ల మేము మీకు మీ ఫోన్లో నుండి వీడియోను మీ టీవీలో ప్రసారం చేయడం లో సహాయపడటం మొదలైనవి చేయగలుగుతాము.
  • కుక్కీ డేటా: కుక్కీ IDలు మరియు సెట్టింగ్‌లతో సహా మీ పరికరంలో నిల్వ చేసిన కుక్కీల నుండి డేటా. మేము కుక్కీలను ఎలా వినియోగిస్తామనే దాని గురించి Facebook కుక్కీల విధానం మరియు Instagram కుక్కీల విధానంలో మరింత తెలుసుకోండి.
భాగస్వాముల నుండి సమాచారం.
ప్రకటనదారులు, యాప్ డెవలపర్‌లు మరియు ప్రచురణకర్తలు మా సామాజిక ప్లగిన్‌లు (ఇష్టం బటన్ వంటివి), Facebook లాగిన్, మా APIలు మరియు SDKలు లేదా Facebook పిక్సెల్‌తో సహా తాము వినియోగించే Facebook వ్యాపార సాధనాల ద్వారా మాకు సమాచారాన్ని పంపగలరు. ఈ భాగస్వాములు మీరు Facebook వెలుపల చేసిన కార్యకలాపాల గురించిన సమాచారాన్ని అందిస్తారు, ఇందులో మీ పరికరం, మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు, మీ కొనుగోళ్లు, మీరు చూసే ప్రకటనలు మరియు మీకు Facebook ఖాతా లేనప్పటికీ లేదా Facebookలో లాగిన్ చేయనప్పటికీ వారి సేవలను మీరు ఎలా వినియోగిస్తారనే దాని గురించిన సమాచారం ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఆడే గేమ్‌ల గురించి మాకు తెలియజేయడానికి గేమ్ డెవలపర్ మా APIని ఉపయోగించవచ్చు లేదా మీరు స్టోర్‌లో చేసిన కొనుగోళ్ల గురించి వ్యాపార సంస్థ మాకు తెలియజేయవచ్చు. మేము మీ ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ చర్యల గురించిన సమాచారాన్ని మరియు మాకు మీ సమాచారాన్ని అందించేందుకు హక్కులు ఉన్న మూడవ పక్ష డేటా ప్రదాతల నుండి కొనుగోళ్ల సమాచారాన్ని కూడా స్వీకరిస్తాము.

మీరు భాగస్వాముల సేవలను సందర్శించినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు లేదా వారితో కలిసి పని చేస్తున్న మూడవ పక్షాల ద్వారా వారు మీ డేటాను స్వీకరిస్తారు. ఈ భాగస్వాముల్లో ప్రతి ఒక్కరూ మాకు ఏదైనా డేటాను అందించే ముందు మీ డేటాను సేకరించేందుకు, వినియోగించేందుకు మరియు భాగస్వామ్యం చేసేందుకు వారు న్యాయపరమైన హక్కులు కలిగి ఉండాలి. మేము డేటాను స్వీకరించే భాగస్వాముల రకాల గురించి మరింత తెలుసుకోండి.

మేము Facebook వ్యాపార సాధనాలకు సంబంధించి కుక్కీలను ఎలా వినియోగిస్తామనే దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి Facebook కుక్కీల విధానం మరియు Instagram కుక్కీల విధానాన్ని సమీక్షించండి.

మేము ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తాము?

మేము మా వద్ద ఉన్న (మీరు చేసే ఎంపికలకు లోబడి) సమాచారాన్ని దిగువ వివరించిన విధంగా, అలాగే Facebook నిబంధనలు మరియు Instagram నిబంధనలలో వివరించిన Facebook ఉత్పత్తులు మరియు సంబంధిత సేవలను అందించడానికి మరియు మద్దతు తెలపడానికి ఉపయోగిస్తాము. అది ఎలాగో ఇక్కడ చూడండి:
మా ఉత్పత్తులను అందించడం, వ్యక్తిగతీకరించడం మరియు మెరుగుపరచడం.
మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని విశేషాంశాలు మరియు కంటెంట్‌ను (మీ వార్తల ఫీడ్, Instagram ఫీడ్, Instagram కథనాలు మరియు ప్రకటనలతో సహా) వ్యక్తిగతీకరించడానికి, అలాగే మా ఉత్పత్తులలో మరియు వెలుపల మీ కోసం సూచనలు అందించడానికి (మీకు ఆసక్తి ఉన్న సమూహాలు లేదా ఈవెంట్‌లు లేదా మీరు అనుసరించాలనుకునే అంశాల వంటివి) సహా మా ఉత్పత్తులను అందించడానికి వినియోగిస్తాము. మీకు ప్రత్యేకమైన మరియు సముచితంగా వ్యక్తిగతీకరించిన ఉత్పత్తులను సృష్టించడానికి, మేము సేకరించే డేటా ఆధారంగా మీ అనుసంధానాలు, ప్రాధాన్యతలు, ఆసక్తులు మరియు కార్యకలాపాలను వినియోగిస్తాము, అలాగే మీ నుండి మరియు ఇతరుల నుండి (మీరు అందించాలనుకునే ఏదైనా ప్రత్యేక రక్షణలతో ఉన్న డేటా సహా, ఇందులో మీరు మీ స్పష్టమైన సమ్మతిని తెలియజేస్తారు); మీరు మా ఉత్పత్తులను ఎలా ఉపయోగిస్తారు మరియు వాటితో ఎలా పరస్పర చర్య చేస్తారు; మరియు మీరు అనుసంధానం అయ్యే వ్యక్తులు, స్థలాలు మరియు అంశాలు మరియు మా ఉత్పత్తులలో ఉన్న మరియు లేని వాటి పట్ల ఆసక్తి వివరాలను తెలుసుకుంటాము. Facebook ఉత్పత్తుల్లోని విశేషాంశాలు, కంటెంట్ మరియు సిఫార్సులతో సహా మీ Facebook మరియు Instagram అనుభవాన్ని వ్యక్తిగతీకరించడానికి మీ గురించిన సమాచారాన్ని మేము ఎలా వినియోగిస్తామనే దాని గురించి మరింత తెలుసుకోండి; అలాగే మీకు చూపే ప్రకటనలను మేము ఎలా ఎంచుకుంటామనే దాని గురించి కూడా మరిన్ని వివరాలు తెలుసుకోండి.
  • Facebook ఉత్పత్తులు మరియు పరికరాల్లో సమాచారం: మీరు అన్ని Facebook ఉత్పత్తుల్లో ఉపయోగించే మరింత సర్దుబాటు చేసిన మరియు అనుకూల అనుభవాన్ని అందించడానికి వేర్వేరు Facebook ఉత్పత్తులు మరియు పరికరాల్లో మీ కార్యకలాపాల గురించిన సమాచారాన్ని అనుసంధానిస్తాము. ఉదాహరణకు, మిమ్మల్ని Facebook సమూహంలో చేరమని సిఫార్సు చేస్తాం., ఇందులో మీరు Instagramలో అనుసరించే లేదా Messenger ద్వారా కమ్యూనికేట్ చేసే వ్యక్తులు ఉంటారు. మేము మీ అనుభవాన్ని మరింత నిరంతరాయంగా కూడా మారుస్తాము, ఉదాహరణకు, మీరు వేరొక ఉత్పత్తిపై ఒక ఖాతా కోసం సైన్ అప్ చేసినప్పుడు ఒక Facebook ఉత్పత్తి నుండి మీ నమోదు సమాచారాన్ని (మీ ఫోన్ నంబర్ వంటివి) స్వయంచాలకంగా పూరించడం.
  • స్థాన సంబంధిత సమాచారం: మీకు మరియు ఇతరులకు ప్రకటనలతో సహా మా ఉత్పత్తులను అందించేందుకు, వ్యక్తిగతీకరించేందుకు మరియు వాటిని మెరుగుపరిచేందుకు మేము మీ ప్రస్తుత స్థానం, మీరు నివసించే ప్రదేశం, మీరు వెళ్లాలనుకునే ప్రదేశాలు మరియు మీకు సమీపంలోని వ్యాపారాలు మరియు వ్యక్తుల వంటి స్థాన సంబంధిత సమాచారాన్ని వినియోగిస్తాము. స్థాన సంబంధిత సమాచారం అనేది పరికరం యొక్క ఖచ్చితమైన స్థానం (దాన్ని సేకరించడానికి మీరు అనుమతిస్తే), IP చిరునామాలు మరియు Facebook ఉత్పత్తులకు (మీ చెక్ ఇన్‌లు లేదా హాజరయ్యే ఈవెంట్‌ల వంటివి) సంబంధించి మీ మరియు ఇతరుల వినియోగం గురించిన సమాచారం ఆధారంగా ఉంటుంది.
  • ఉత్పత్తి పరిశోధన మరియు అభివృద్ధి: సర్వేలు మరియు పరిశోధనలను నిర్వహించడం మరియు కొత్త ఉత్పత్తులు మరియు ఫీచర్లను పరీక్షించడం మరియు సమస్యలను అధిగమించడం వంటి వాటితో సహా మా ఉత్పత్తులను అభివృద్ధి పరచడానికి, పరీక్షించడానికి మరియు మెరుగుపరచడానికి మేము సమాచారాన్ని ఉపయోగిస్తాం.
  • ముఖ గుర్తింపు: మీరు దీన్ని ఆన్ చేసి ఉంటే, మిమ్మల్ని ఫోటోలు, వీడియోలు మరియు కెమెరా అనుభవాలతో గుర్తించడానికి మేము ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగిస్తాము. మేము సృష్టించే ముఖం గుర్తింపు టెంప్లేట్‌లు EU చట్టం క్రింద ప్రత్యేక రక్షణలు కలిగిన డేటా వలె పరిగణించబడుతుంది. మేము ముఖ గుర్తింపు సాంకేతికతలను ఎలా ఉపయోగిస్తాము లేదా Facebook సెట్టింగ్‌లలో ఈ సాంకేతికత యొక్క మా వినియోగాన్ని ఎలా నియంత్రిస్తామనే దాని గురించి మరింత తెలుసుకోండి. మేము మీ Instagram అనుభవానికి మీ ముఖ గుర్తింపు సాంకేతికతను జత చేస్తే, ఆ విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాము మరియు మీ కోసం ఈ సాంకేతికతను వినియోగించాలా వద్దా అనే విషయంపై మీకు నియంత్రణ ఉంటుంది.
  • ప్రకటనలు మరియు ఇతర ప్రాయోజిత కంటెంట్: మేము మీకు చూపించే ప్రకటనలను, ఆఫర్‌లను మరియు ఇతర ప్రాయోజిత కంటెంట్‌ని ఎంచుకోవడానికి మరియు వ్యక్తిగతీకరించడానికి మీ ఆసక్తులు, చర్యలు మరియు అనుసంధానాలకు సంబంధించిన సమాచారంతో సహా మీ గురించి మా దగ్గర ఉన్న సమాచారాన్ని మేము వినియోగిస్తాము. మేము ప్రకటనలను ఎలా ఎంచుకుంటాము మరియు వ్యక్తిగతీకరిస్తామనే దాని గురించి మరియు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లలో మీ కోసం ప్రకటనలను మరియు ఇతర ప్రాయోజిత కంటెంట్‌ను ఎంచుకోవడానికి మేము ఉపయోగించే డేటాపై మీ ఎంపికల గురించి మరింత తెలుసుకోండి.
అంచనా, విశ్లేషణలు మరియు ఇతర వ్యాపార సేవలను అందించడం.
మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని (మా ఉత్పత్తుల వెలుపల మీరు సందర్శించే వెబ్‌సైట్‌లు మరియు మీరు చూసే ప్రకటనల వంటి మీ కార్యకలాపంతో సహా) ప్రకటనదారులు మరియు ఇతర భాగస్వాములు తమ ప్రకటనలు మరియు సేవల ప్రభావాన్ని మరియు పంపిణీని గణించడంలో మరియు తమ సేవలను ఎటువంటి వ్యక్తులు వినియోగిస్తున్నారు మరియు తమ వెబ్‌సైట్‌లు, యాప్‌లు మరియు సేవలలో వ్యక్తులు ఎలాంటి చర్యలు చేస్తున్నారు వంటివి అర్థం చేసుకోవడంలో వారికి సహాయం అందించేందుకు ఉపయోగిస్తాము. ఈ భాగస్వాములతో మేము సమాచారాన్ని ఏ విధంగా పంచుకుంటామో తెలుసుకోండి.
భద్రత, సమగ్రత మరియు రక్షణను పెంపొందించడం.
ఖాతాలు మరియు కార్యకలాపాన్ని ధృవీకరించడానికి, హానికరమైన ప్రవర్తనను ఎదుర్కోవడానికి, స్పామ్‌ని మరియు ఇతర చేదు అనుభవాలను గుర్తించి నిరోధించడానికి, మా ఉత్పత్తుల సమగ్రతను కొనసాగించడానికి మరియు Facebook ఉత్పత్తులలో మరియు వెలుపల భద్రత మరియు రక్షణను పెంపొందించడానికి మేము మా వద్ద ఉన్న సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, మేము మా వద్దనున్న సమాచారాన్ని అనుమానాస్పద కార్యకలాపాన్ని లేదంటే నిబంధనలు లేదా విధానాల ఉల్లంఘనలను దర్యాప్తు చేయడానికి లేదా ఎవరికైనా సహాయం అవసరమైతే గుర్తించడానికి ఉపయోగిస్తాము. మరింత తెలుసుకోవడానికి, Facebook భద్రతా సహాయ కేంద్రాన్ని మరియు Instagram భద్రతా చిట్కాలను సందర్శించండి.
మీతో కమ్యూనికేట్ చేయడం.
మీకు మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లను పంపడానికి, మా ఉత్పత్తుల గురించి మీతో కమ్యూనికేట్ చేయడానికి, అలాగే మా విధానాలు మరియు నిబంధనల గురించి మీకు తెలియజేయడానికి మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించినప్పుడు ప్రతిస్పందించడానికి కూడా మేము మీ సమాచారాన్ని ఉపయోగిస్తాము.
సామాజిక శ్రేయస్సు కోసం పరిశోధించడం మరియు కొత్త మార్పులు చేయడం.
మేము మా వద్ద ఉన్న (మేము కలిసి పని చేసే పరిశోధనా భాగస్వాములతో సహా) సమాచారాన్ని సామాజిక సంక్షేమం, సాంకేతిక ప్రగతి, ప్రజాసక్తి, ఆరోగ్యం మరియు సంక్షేమం వంటి అంశాలపై పరిశోధన మరియు ఆవిష్కరణలను నిర్వహించేందుకు మరియు మద్దతు ఇచ్చేందుకు సమాచారాన్ని ఉపయోగిస్తాము. ఉదాహరణకు, సహాయ కార్యక్రమాలలో తోడ్పాటు అందించడం కోసం విపత్తుల సమయంలో వలస వెళ్లే మార్గాల గురించి మా వద్ద ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తాము. మా పరిశోధన ప్రోగ్రామ్‌ల గురించి మరింత తెలుసుకోండి.

ఈ సమాచారం ఎలా పంచుకోబడుతుంది?

మీ సమాచారం క్రింది మార్గాల్లో ఇతరులతో పంచుకోబడుతుంది:

Facebook ఉత్పత్తులలో పంచుకోవడం
మీరు పంచుకునే మరియు కమ్యూనికేట్ చేసే వ్యక్తులు మరియు ఖాతాలు
మీరు మా ఉత్పత్తులను ఉపయోగించి పంచుకునేటప్పుడు మరియు కమ్యూనికేట్ చేసేటప్పుడు, మీరు పంచుకునే వాటిని చూడగల ప్రేక్షకులను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు, మీరు Facebookలో పోస్ట్ చేసినప్పుడు, పోస్ట్ కోసం ప్రేక్షకులను అనగా సమూహం, మీ స్నేహితులందరూ, పబ్లిక్ లేదా అనుకూలీకృత వ్యక్తుల జాబితా వంటి ఎంపికలను మీరు ఎంచుకోవచ్చు. అదే విధంగా, మీరు వ్యక్తులు లేదా వ్యాపార సంస్థలతో కమ్యూనికేట్ చేయడానికి Messenger లేదా Instagramను ఉపయోగించినప్పుడు, ఆ వ్యక్తులు మరియు వ్యాపార సంస్థలు మీరు పంపే కంటెంట్‌ను చూడగలరు. మీరు ప్రకటనలు మరియు ప్రాయోజిత కంటెంట్ గురించి చేసే చర్చలతో సహా మా ఉత్పత్తులలో తీసుకున్న చర్యలను కూడా మీ నెట్‌వర్క్ చూడగలుగుతుంది. అలాగే మేము ఇతర ఖాతాలకు కూడా తమ Facebook లేదా Instagram కథనాలను ఎవరెవరు వీక్షించారో చూడటానికి అనుమతి ఇస్తాము.

పబ్లిక్ సమాచారాన్ని మా ఉత్పత్తులలో లేదా వెలుపల వ్యక్తులు ఎవరైనా వారికి ఖాతా లేకపోయినప్పటికీ చూడగలరు. ఇందులో మీ Instagram వినియోగదారు పేరు; మీరు పబ్లిక్ ప్రేక్షకులతో పంచుకున్న ఏదైనా సమాచారం; మీ Facebookలో పబ్లిక్ ప్రొఫైల్‌లోని సమాచారం; మరియు మీరు Facebook పేజీలో పంచుకునే కంటెంట్, పబ్లిక్ Instagram ఖాతా లేదా Facebook Marketplace వంటి ఏదైనా ఇతర పబ్లిక్ ఫోరమ్ వంటివి ఉంటాయి. మీరు, Facebook మరియు Instagramను వినియోగించే ఇతర వ్యక్తులు మరియు మేము ఇతర Facebook కంపెనీ ఉత్పత్తులు, శోధన ఫలితాల్లో లేదా సాధనాలు మరియు APIల ద్వారా మా ఉత్పత్తుల్లో లేదా వెలుపల ఎవరికైనా పబ్లిక్ సమాచారానికి యాక్సెస్‌ను అందించవచ్చు లేదా సమాచారాన్ని పంపవచ్చు. పబ్లిక్ సమాచారాన్ని శోధన ఇంజిన్‌లు, APIలు వంటి మూడవ-పక్షం సేవలు మరియు టీవీ వంటి ఆఫ్‌లైన్ మీడియా, అలాగే యాప్‌లు, వెబ్‌సైట్‌లు మరియు మా ఉత్పత్తులతో ఏకీకరించబడిన ఇతర సేవల ద్వారా కూడా చూడవచ్చు, యాక్సెస్ చేయవచ్చు, మళ్లీ పంచుకోవచ్చు లేదా డౌన్‌లోడ్ చేయవచ్చు.

Facebook మరియు Instagramలలో ఏ సమాచారం పబ్లిక్‌గా ఉంటుంది మరియు మీకు కనిపించే దానిని ఏవిధంగా నియంత్రించాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
ఇతరులు మీ గురించి పంచుకునే లేదా తిరిగి పంచుకునే కంటెంట్
మా ఉత్పత్తులలో మీ కార్యకలాపాన్ని చూడగలిగే వ్యక్తులు దాన్ని మీరు భాగస్వామ్యం చేసిన ప్రేక్షకులు కాని వ్యక్తులు మరియు వ్యాపారాలతో సహా మా ఉత్పత్తుల్లో ఉన్న మరియు లేని ఇతరులతో పంచుకునేందుకు ఎంచుకోవచ్చు కాబట్టి మీరు ఎవరితో పంచుకుంటున్నారో సరిచూసుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు, మీరు నిర్దిష్ట స్నేహితులకు లేదా ఖాతాలతో ఏదైనా పోస్ట్‌ను పంచుకున్నప్పుడు లేదా ఏదైనా సందేశాన్ని పంపినప్పుడు, వారు ఆ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేయవచ్చు, స్క్రీన్‌షాట్ తీయవచ్చు లేదా మా ఉత్పత్తులలో లేదా వెలుపల ఇతరులతో మళ్లీ పంచుకోవచ్చు, దీన్ని వ్యక్తిగతంగా లేదా Facebook Spaces వంటి వర్చువల్ రియాలిటీ అనుభవాలలో చేయవచ్చు. దానితోపాటుగా, మీరు ఎవరిదైనా పోస్ట్‌పై వ్యాఖ్యానించినప్పుడు లేదా వారి కంటెంట్‌కు ప్రతిస్పందించినప్పుడు, మీ వ్యాఖ్య లేదా ప్రతిస్పందనను సదరు వ్యక్తి కంటెంట్‌ను చూడగలిగే ఎవరైనా చూడగలుగుతారు మరియు ఆ వ్యక్తి తర్వాతి కాలంలో ప్రేక్షకులను మార్చుకోగలరు.

వ్యక్తులు తాము ఎంచుకున్న ప్రేక్షకులతో మీ గురించిన కంటెంట్‌ను రూపొందించడానికి మరియు పంచుకోవడానికి కూడా, మా ఉత్పత్తులను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, వ్యక్తులు కథనంలో మీ ఫోటోను పంచుకోవచ్చు, పోస్ట్‌లోని స్థానంలో మిమ్మల్ని పేర్కొనవచ్చు లేదా ట్యాగ్ చేయవచ్చు లేదా వారి పోస్ట్‌లలో లేదా సందేశాలలో మీ గురించిన సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇతరులు మా ఉత్పత్తులలో మీ గురించి పంచుకున్న సమాచారం మీకు ఇబ్బంది కలిగిస్తుంటే, కంటెంట్‌ను నివేదించడం ఎలాగో మీరు తెలుసుకోవచ్చు.
మా ఉత్పత్తులలో మీ సక్రియ స్థితి లేదా ఉనికి గురించిన సమాచారం.
మా ఉత్పత్తులలో మీరు సక్రియంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని తెలిపే సిగ్నల్‌లను మీ నెట్‌వర్క్‌లలోని వ్యక్తులు చూడగలుగుతారు, ప్రస్తుతం మీరు Instagram, Messenger లేదా Facebookలో సక్రియంగా ఉన్నారా లేదంటే మీరు మా ఉత్పత్తులను చివరిగా ఎప్పుడు ఉపయోగించారు వంటివి.
యాప్‌లు, వెబ్‌సైట్‌లు మరియు మా ఉత్పత్తులలోని లేదా వాటిని ఉపయోగించే మూడవ పక్ష ఏకీకరణలు.
మీరు మా ఉత్పత్తులను వినియోగించే లేదా వాటితో ఏకీకృతమైన మూడవ పక్ష యాప్‌లు, వెబ్‌సైట్‌లు లేదా ఇతర సేవలను వినియోగించేందుకు ఎంచుకున్నప్పుడు, అవి మీరు పోస్ట్ చేసే లేదా పంచుకునే వాటి గురించి సమాచారాన్ని స్వీకరించగలవు. ఉదాహరణకు, మీరు మీ Facebook స్నేహితులతో గేమ్ ఆడినప్పుడు లేదా వెబ్‌సైట్‌లో Facebook వ్యాఖ్య లేదా భాగస్వామ్యం బటన్‌ను ఉపయోగించినప్పుడు, గేమ్ డెవలపర్ లేదా వెబ్‌సైట్ గేమ్‌లో మీ కార్యకలాపాల గురించి సమాచారాన్ని స్వీకరించగలదు లేదా మీరు Facebookలో వెబ్‌సైట్ నుండి పంచుకునే వ్యాఖ్యను లేదా లింక్‌ను స్వీకరించగలదు. అలాగే, మీరు అలాంటి మూడవ-పక్షం సేవలను డౌన్‌లోడ్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, వారు Facebookలో మీ పబ్లిక్ ప్రొఫైల్‌ను మరియు మీరు వారితో పంచుకునే ఏదైనా సమాచారాన్ని యాక్సెస్ చేయగలరు. మీరు వినియోగించే యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లతో Facebook స్నేహితుల జాబితాను పంచుకునేందుకు ఎంచుకున్నప్పుడు అవి వాటిని స్వీకరించవచ్చు. అయితే మీరు వినియోగించే యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లు మీ నుండి మీ Facebook స్నేహితుల గురించిన ఏ ఇతర సమాచారాన్ని లేదా మీ Instagram అనుచరుల్లో (మీ స్నేహితులు మరియు అనుచరులు అయినప్పటికీ కూడా తమంతట తాము ఈ సమాచారాన్ని పంచుకునేందుకు ఎంచుకోవాలి) ఎవరి గురించి సమాచారాన్ని స్వీకరించలేవు. ఈ మూడవ-పక్షం సేవల ద్వారా సేకరించిన సమాచారం దీనికి కాకుండా వారి స్వంత నిబంధనలు మరియు విధానాలకు లోబడి ఉంటుంది.

Facebook మరియు Instagram (అంటే మేము మా స్వంత మొదటి పక్ష యాప్‌లను అభివృద్ధి చేయనివి) స్థానిక సంస్కరణలను అందించే పరికరాలు మరియు ఆపరేటింగ్ సిస్టమ్‌లు మీ స్నేహితులు మీతో పంచుకునే సమాచారంతో సహా మీరు వాటితో పంచుకువాలనుకునే సమాచారం మొత్తాన్ని యాక్సెస్ చేయగలవు, తద్వారా అవి మీకు మా ప్రధాన కార్యాచరణను అందించగలవు.

గమనిక: మేము దుర్వినియోగాన్ని నివారించడంలో సహాయకరంగా ఉండేందుకు కూడా డెవలపర్‌లకు డేటా యాక్సెస్‌ను నియంత్రించే పనిలో ఉన్నాము. ఉదాహరణకు, మీరు డెవలపర్‌ల యాప్‌ను 3 నెలలపాటు వినియోగించకుంటే డెవలపర్‌లకు మీ Facebook మరియు Instagram యాక్సెస్‌ను తీసివేసి, లాగిన్‌ను మార్చుతాము, దీని వల్ల తదుపరి సంస్కరణలో పేరు, Instagram వినియోగదారు పేరు మరియు వ్యక్తిగత వివరాలు, ప్రొఫైల్ ఫోటో మరియు ఇమెయిల్ చిరునామాను మాత్రమే కలిగి ఉండేందుకు యాప్ సమీక్ష లేకుండానే యాప్ అభ్యర్థించగల డేటాను తగ్గిస్తాము. ఏదైనా ఇతర డేటాను అభ్యర్థించడం కోసం మా ఆమోదం అవసరం.
కొత్త యజమాని.
మా ఉత్పత్తులు లేదా వాటి ఆస్తులలో సంపూర్ణంగా లేదా పాక్షికంగా యాజమాన్యం మరియు నియంత్రణలో మార్పులు చోటుచేసుకుంటే, మేము మీ సమాచారాన్ని కొత్త యజమానికి బదిలీ చేయవచ్చు.

మూడవ పక్ష భాగస్వాములతో పంచుకోవడం
మా ఉత్పత్తులను అందించడంలో మరియు మెరుగుపరచడంలో మాకు సహాయపడే లేదా వ్యాపారాభివృద్ధి కోసం Facebook వ్యాపార సాధనాలను ఉపయోగించే మూడవ పక్ష భాగస్వాములతో మేము కలిసి పని చేస్తాము, దీని వల్ల మా కంపెనీలను నిర్వహించగలుగుతాము మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉచిత సేవలను అందించగలుగుతాము. మేము మీ సమాచారం దేన్నీ ఎప్పటికీ ఎవరికీ విక్రయించము. మేము అందించే డేటాను మా భాగస్వాములు ఉపయోగించగల మరియు వెల్లడించగల విధానంపై ఖచ్చితమైన ఆంక్షలను కూడా విధిస్తాము. మేము సమాచారాన్ని పంచుకునే మూడవ పక్షం రకాలు ఇక్కడ ఉన్నాయి:
మా విశ్లేషణల సేవలను ఉపయోగించే భాగస్వాములు.
ప్రజలు Facebook ఉత్పత్తులలో మరియు వెలుపల తమ పోస్ట్‌లు, జాబితాలు, పేజీలు, వీడియోలు మరియు ఇతర కంటెంట్‌తో ఎలాంటి చర్యలు చేస్తున్నారనేది అర్థం చేసుకోవడంలో వ్యక్తులకు మరియు వ్యాపార సంస్థలకు సహాయపడే సమగ్రమైన గణాంకాలను మరియు అంతర్దృష్టులను మేము అందిస్తాము. ఉదాహరణకు, పేజీ నిర్వాహకులు మరియు Instagram వ్యాపార ప్రొఫైల్‌లు తమ పోస్ట్‌లను వీక్షించిన, వాటికి ప్రతిస్పందించిన లేదా వాటిపై వ్యాఖ్యానించిన వ్యక్తులు మరియు ఖాతాల సంఖ్య గురించిన సమాచారం, అలాగే తమ పేజీ లేదా ఖాతాతో చేసే చర్యలను అర్థం చేసుకోవడంలో సహాయపడే సమగ్రమైన జనాభా సంబంధిత మరియు ఇతర సమాచారం స్వీకరిస్తారు.
ప్రకటనదారులు.
ఏ రకాల వ్యక్తులు తమ ప్రకటనలను చూస్తున్నారు మరియు తమ ప్రకటనల ప్రభావం ఎలా ఉందనే వాటికి సంబంధించిన నివేదికలను మేము ప్రకటనదారులకు అందిస్తాము, కానీ మీరు మాకు అనుమతినిస్తే మినహా మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తుపట్టగల సమాచారం (మిమ్మల్ని సంప్రదించడానికి ఉపయోగించగల లేదా మీరెవరో గుర్తుపట్టగల మీ పేరు లేదా ఇమెయిల్ చిరునామా వంటి సమాచారం) ఏదీ పంచుకోము. ఉదాహరణకు, ప్రకటనదారులు తమ ప్రేక్షకులను మెరుగ్గా అర్థం చేసుకోవడంలో సహాయపడేందుకు మేము వారికి సాధారణ జనాభా మరియు ఆసక్తి సంబంధిత సమాచారాన్ని (ఉదా, మాడ్రిడ్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌ను ఇష్టపడే 25 - 34 ఏళ్ల మధ్యవయస్సు గల స్త్రీ ప్రకటనను చూసారు) అందిస్తాము. మేము ఎలాంటి Facebook ప్రకటనలు మిమ్మల్ని కొనుగోలు చేసేలా లేదా ప్రకటనదారును సంప్రదించేలా ప్రేరేపిస్తున్నాయనే విషయాన్ని కూడా నిర్ధారించుకుంటాము.
అంచనా భాగస్వాములు.
మా భాగస్వాములకు విశ్లేషణలను మరియు అంచనా నివేదికలను అందించడం కోసం సమగ్రపరిచే సంస్థలతో మేము మీ గురించిన సమాచారాన్ని పంచుకుంటాము.
మా ఉత్పత్తులలో వస్తువులు మరియు సేవలను అందించే భాగస్వాములు.
మీరు ప్రీమియం కంటెంట్‌ను స్వీకరించడం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకున్నప్పుడు లేదా మా ఉత్పత్తులలో విక్రేత నుండి ఏదైనా కొనుగోలు చేసినప్పుడు, మీ పబ్లిక్ సమాచారం మరియు మీరు వారితో పంచుకున్న ఇతర సమాచారం, అలాగే షిప్పింగ్ మరియు సంప్రదింపు వివరాలతో సహా లావాదేవీని పూర్తి చేయడానికి అవసరమైన సమాచారాన్ని కంటెంట్ సృష్టికర్త లేదా విక్రేత స్వీకరించగలరు.
విక్రేతలు మరియు సేవా ప్రదాతలు.
సాంకేతిక మౌలిక సదుపాయాల సేవలను అందించడం, మా ఉత్పత్తులు వినియోగించబడే విధానాన్ని విశ్లేషించడం, కస్టమర్ సేవను అందించడం, చెల్లింపుల సౌలభ్యం కల్పించడం లేదా సర్వేలను నిర్వహించడం ద్వారా మా వ్యాపారానికి మద్దతిచ్చే విక్రేతలు మరియు సేవా ప్రదాతలకు సమాచారం మరియు కంటెంట్‌ను మేము అందిస్తాము.
పరిశోధకులు మరియు విద్యావేత్తలు.
మా వ్యాపారం లేదా లక్ష్యానికి మద్దతుగా స్కాలర్‌షిప్ మరియు నూతన మార్పులను మరింత ముందుకు తీసుకెళ్లేలా, అలాగే సాధారణ సామాజిక సంరక్షణ, సాంకేతిక అభివృద్ధి, ప్రజాసక్తి, ఆరోగ్యం మరియు సంరక్షణ వంటి అంశాలపై పరిశోధన మరియు ఆవిష్కరణను మెరుగుపరిచేలా పరిశోధనలను నిర్వహించడానికి మేము పరిశోధన భాగస్వాములు మరియు విద్యావేత్తలకు సమాచారం మరియు కంటెంట్‌ను అందిస్తాము.
చట్టపరిరక్షణ సంస్థ లేదా చట్టపరమైన అభ్యర్థనలు.
దిగువ పేర్కొన్న సందర్భాలలో మేము చట్టపరిరక్షణ సంస్థలకు లేదా చట్టపరమైన అభ్యర్థనలకు ప్రతిస్పందనగా సమాచారాన్ని అందిస్తాము.
మీరు లేదా ఇతరులు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లలో మూడవ పక్ష భాగస్వాములతో పంచుకునే మీ గురించిన సమాచారాన్ని మీరు ఎలా నియంత్రించగలరనే విషయం గురించి మరింత తెలుసుకోండి.

Facebook కంపెనీలు కలిసి ఎలా పని చేస్తాయి?

మీరు ఉపయోగించే Facebook సంస్థ ఉత్పత్తులు అన్నింటిలో సృజనాత్మక, సంబంధిత, స్థిరమైన మరియు సురక్షితమైన అనుభవాన్ని అందించడం కోసం Facebook మరియు Instagram (WhatsApp మరియు Oculusతో సహా) ఇతర Facebook సంస్థలతో అవస్థాపన, సిస్టమ్‌లు మరియు సాంకేతికతను పంచుకుంటాయి. వర్తించే చట్టప్రకారం అనుమతి ఉన్న పరిధి మేరకు మరియు వారి నిబంధనలు మరియు విధానాలకు అనుగుణంగా ఈ ప్రయోజనాల కోసం మేము మీ గురించిన సమాచారాన్ని Facebook సంస్థలలో ప్రాసెస్ చేస్తాము. ఉదాహరణకు, తమ సేవలో స్పామ్‌ను పంపుతున్న ఖాతాల గురించి WhatsApp అందించిన సమాచారాన్ని మేము ప్రాసెస్ చేసి, ఆపై Facebook, Instagram లేదా Messengerలో ఆ ఖాతాలపై తగిన చర్యలు తీసుకోగలము. అలాగే ప్రజలు Facebook సంస్థ ఉత్పత్తులను ఎలా వినియోగిస్తున్నారు మరియు పరస్పర చర్య చేస్తున్నారో అర్థం చేసుకునే దిశగా మేము కృషి చేస్తున్నాము, ఉదాహరణకు, వివిధ Facebook సంస్థ ఉత్పత్తులలో ప్రత్యేక వినియోగదారుల సంఖ్యను అర్థం చేసుకోవడం వంటివి.

డేటా ప్రాసెసింగ్‌పై మేము అవలంబించే చట్టపరమైన విధానం ఏమిటి?

మేము ఎగువ పేర్కొన్న మార్గాలలో మా దగ్గర ఉన్న డేటాను సేకరిస్తాము, వినియోగిస్తాము మరియు పంచుకుంటాము:

  • మీ సమ్మతికి అనుగుణంగా, మీరు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లలో ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు;
  • మా చట్టపరమైన బాధ్యతలకు లోబడి ఉండాల్సినప్పుడు;
  • మీ లేదా ఇతరుల యొక్క ముఖ్యమైన ఆసక్తులను కాపాడటానికి;
  • ప్రజాసక్తి మేరకు; మరియు
  • మా వినియోగదారులు మరియు భాగస్వాములకు సృజనాత్మక, వ్యక్తిగతీకృత, సురక్షితమైన మరియు లాభదాయకమైన సేవను అందించడంలో మా ఆసక్తులతో సహా మా (లేదా ఇతరుల) చట్టబద్ధమైన ఆసక్తుల కోసం అవసరమైనప్పుడు, ఆ ఆసక్తులను మీ ఆసక్తులు లేదంటే వ్యక్తిగత డేటా సంరక్షణ అవసరమయ్యే ప్రాథమిక హక్కులు మరియు స్వేచ్ఛ భర్తీ చేసినప్పుడు మినహా.

ఈ చట్టపరమైన ఆధారాలు మరియు ఇవి మేము డేటాను ప్రాసెస్ చేసే విధానాలకు ఎలా సంబంధితంగా ఉన్నాయనే దాని గురించి మరింత తెలుసుకోండి.

GDPR క్రింద అందించబడిన మీ హక్కులను మీరు ఎలా అమలుపరచగలరు?

సాధారణ డేటా సంరక్షణ నియంత్రణ క్రింద, మీకు మీ డేటాను యాక్సెస్ చేసే, సరిదిద్దే, పోర్ట్ చేసే మరియు తీసివేసే హక్కు ఉంది. ఈ హక్కుల గురించి మరింత తెలుసుకోండి మరియు Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లలో మీరు మీ హక్కులను ఎలా అమలు చేయగలరో కనుగొనండి. అలాగే మీకు మీ నిర్దిష్ట డేటా ప్రాసెసింగ్‌కు అభ్యంతరం తెలిపే హక్కు మరియు నియంత్రించే హక్కు ఉంది. ఇందులో ఉన్న హక్కులు:

  • డైరెక్ట్ మార్కెటింగ్ కోసం మీ డేటాను మేము ప్రాసెస్ చేయడంపై అభ్యంతరం తెలిపే హక్కు, ఆ మార్కెటింగ్ కమ్యూనికేషన్‌లలోని "అన్‌సబ్‌స్క్రైబ్ చేయి" లింక్‌ను ఉపయోగించి దీనిని మీరు అమలుపరచవచ్చు; మరియు
  • మేము ప్రజాసక్తి మేరకు విధిని నిర్వహిస్తున్నప్పుడు లేదంటే మా లేదా మూడవ పక్షం యొక్క చట్టబద్ధమైన ఆసక్తులను పొందుతున్నప్పుడు మేము మీ డేటాను ప్రాసెస్ చేయడంపై అభ్యంతరం తెలిపే హక్కు. మీరు ఈ హక్కును Facebookలో మరియు Instagramలో అమలుపరచవచ్చు.

డేటాను కలిగి ఉండటం, ఖాతాను నిష్క్రియం చేయడం మరియు తొలగించడం

మా సేవలు మరియు Facebook ఉత్పత్తులను అందించడం కోసం ఇక అవసరం లేకపోవడం లేదా మీ ఖాతా తొలగించబడటం ఏది ముందు జరిగితే అప్పటి వరకు మేము డేటాను నిల్వ చేస్తాము. డేటా రకం, ఇది ఎందుకు సేకరించబడింది మరియు ప్రాసెస్ చేయబడింది, అలాగే సంబంధిత చట్టపరమైన లేదా నిర్వహణాపరమైన నిల్వ అవసరాల ఆధారంగా సందర్భాలవారీగా కనుగొనబడుతుంది. ఉదాహరణకు, మీరు Facebookలో దేని కోసమైనా శోధించినప్పుడు, ఎప్పుడైనా మీ శోధన చరిత్రలో ఆ ప్రశ్నను యాక్సెస్ చేయవచ్చు మరియు తొలగించవచ్చు, కానీ ఆ శోధన లాగ్ 6 నెలల తర్వాత తొలగించబడుతుంది. మీరు ఖాతా ధృవీకరణ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ద్వారా జారీ చేయబడిన మీ ID కాపీని సమర్పిస్తే, మేము ఆ కాపీని 30 రోజుల తర్వాత తొలగిస్తాము. మీరు పంచుకున్న కంటెంట్ మరియు సామాజిక ప్లగిన్‌ల ద్వారా పొందిన కుక్కీ డేటాను తొలగించడం గురించి మరింత తెలుసుకోండి.

మీరు మీ ఖాతాను తొలగించినప్పుడు, మేము మీరు పోస్ట్ చేసిన మీ ఫోటోలు మరియు స్థితి నవీకరణల వంటి అంశాలను తొలగిస్తాము, మీరు ఆపై తర్వాత ఎప్పుడూ ఆ సమాచారాన్ని పునరుద్ధరించలేరు. మీ గురించి ఇతరులు పంచుకున్న సమాచారం మీ ఖాతాలో భాగం కాదు మరియు తొలగించబడదు. మీరు మీ ఖాతాను తొలగించకుండా ఉత్పత్తులను ఉపయోగించడం తాత్కాలికంగా ఆపివేయాలనుకుంటే, బదులుగా మీరు మీ ఖాతాను నిష్క్రియం చేయవచ్చు. మీ ఖాతాను ఎప్పుడైనా తొలగించడానికి, దయచేసి Facebook సెట్టింగ్‌లు మరియు Instagram సెట్టింగ్‌లను సందర్శించండి.

మేము చట్టపరమైన అభ్యర్థనలకు ఎలా ప్రతిస్పందిస్తాము లేదా హానిని ఎలా నిరోధిస్తాము?

మేము మీ సమాచారాన్ని యాక్సెస్ చేయడం, భద్రపరచడం మరియు నియంత్రణ అధికారులు, చట్ట పరిరక్షకులు లేదా ఇతరులతో భాగస్వామ్యం చేయడం వంటివి చేస్తాము:
  • న్యాయపరమైన అభ్యర్థన వచ్చినప్పుడు, మాకు విశ్వసనీయత ఉంటే, చట్ట ప్రకారం అలా చేయమని కోరవచ్చు. మేము ఆ న్యాయ పరిధిలో చట్ట ప్రకారం అవసరమైన ప్రతిస్పందన పట్ల, ఆ అధికార పరిధిలోని వినియోగదారులను ప్రభావితం చేస్తుందని మరియు అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రమాణాలకు లోబడి ఉందని మేము విశ్వసించినప్పుడు న్యాయపరమైన అభ్యర్థనలకు కూడా ప్రతిస్పందిస్తాము.
  • ఇలా చేయడం అవసరమని మేము పూర్తిగా విశ్వసించే పక్షంలో: ఉత్పత్తుల అనధికారిక వినియోగం, మా షరతులు లేదా విధానాలను ఉల్లంఘించడం లేదా మరేదైనా హానికరమైన లేదా చట్ట వ్యతిరేకమైన కార్యాచరణలు, కనిపెట్టడం, నిరోధించడం, మోసపూరిత చర్యలను పరిష్కరించడం; మమ్మల్ని (మా హక్కులు, ఆస్తులు లేదా ఉత్పత్తులు), మిమ్మల్ని లేదా ఇతరులను రక్షించడం కోసం, విచారణలు లేదా నియంత్రణ చట్టాల పరిరక్షణలో భాగంగా; లేదా మరణం లేదా సమీపకాలంలో జరుగనున్న భౌతిక హానిని నివారించడం వంటి సందర్భాలలో మేము ఇలా చేయవచ్చు. ఉదాహరణకు, సందర్భాన్ని బట్టి, మా ఉత్పత్తులలోనూ మరియు వెలుపల మోసపూరిత, దుర్భాషాపూరిత మరియు ఇతర హానికారక కార్యాచరణలను నిరోధించేందుకు మీ ఖాతా యొక్క విశ్వసనీయతను మూడవ-పక్ష భాగస్వాములతో సమాచారాన్ని మార్చుకోవచ్చు.

Facebookలో చేసిన కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీ డేటాతో సహా మీ గురించి మేము స్వీకరించే సమాచారం చట్టపరమైన అభ్యర్థన లేదా బాధ్యత, ప్రభుత్వ విచారణ లేదా మా నిబంధనలు లేదా విధానాల సంభావ్య ఉల్లంఘనలకు సంబంధించిన విచారణలు లేదంటే హాని జరగకుండా నిరోధించడం వంటి వాటికి లోబడి పొడిగించిన కాల వ్యవధి వరకు ప్రాప్యత చేయబడవచ్చు, ప్రాసెస్ చేయబడవచ్చు మరియు నిలిపి ఉంచవచ్చు. పునరావృతంగా దుర్వినియోగం చేయడం లేదా మా నిబంధనలను ఉల్లంఘించడం నిరోధించడానికి కనీసం సంవత్సరం పాటు మా నిబంధనలను ఉల్లంఘించినందుకు నిలిపివేసిన ఖాతాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా మేము నిలిపి ఉంచగలము.

మేము మా ప్రపంచవ్యాప్త సేవలలో భాగంగా డేటాను ఎలా నిర్వహిస్తాము మరియు బదిలీ చేస్తాము?

మేము సమాచారాన్ని భౌగోళికంగా పంచుకుంటాము, Facebook కంపెనీల్లో అంతర్గతంగా, అలాగే మా భాగస్వాములతో మరియు ఈ విధానానికి అనుగుణంగా మీరు ప్రపంచవ్యాప్తంగా అనుసంధానించి, పంచుకునే వారితో బహిర్గతంగా పంచుకుంటాము. Facebook ఐర్లాండ్ నియంత్రణలో ఉన్న లేదా వారు నిల్వ చేసిన లేదా ప్రాసెస్ చేసిన సమాచారం ఈ విధానంలో వివరించిన కారణాల కోసం యునైటెడ్ స్టేట్స్ లేదా మీరు నివసించే ఇతర దేశాలకు బదిలీ చేయబడుతుంది లేదా అందజేయబడుతుంది. Facebook నిబంధనలు మరియు Instagram నిబంధనలలో పేర్కొన్న విధంగా మరియు అంతర్జాతీయంగా నిర్వహించేందుకు మరియు మీకు మా ఉత్పత్తులను అందించడానికి ఈ డేటా బదిలీలు అవసరం. మేము EEA నుండి యునైటెడ్ స్టేట్స్ మరియు ఇతర దేశాలకు డేటా బదిలీలు చేసేందుకు వర్తించిన విధంగా నిర్దిష్ట దేశాల గురించి యూరోపియన్ కమీషన్ ఆమోదించిన ప్రామాణిక ఒప్పంద క్లాజ్‌లను వినియోగిస్తాము మరియు యూరోపియన్ యూనియన్ యొక్క సంపూర్ణ నిర్ణయాలపై ఆధారపడతాము.

ఈ విధానానికి మార్పుల గురించి మేము మీకు ఎలా తెలియజేస్తాము?

మేము ఈ విధానానికి మార్పులు చేసే ముందు మీకు తెలియజేస్తాము మరియు మీరు మా సేవలను ఉపయోగించడం కొనసాగించాలనుకునే ముందు సవరించిన విధానాన్ని సమీక్షించే అవకాశాన్ని మీకు అందిస్తాము.

సందేహాలుంటే Facebookను ఎలా సంప్రదించాలి

మీరు Facebookలో మరియు Instagramలో గోప్యత ఎలా పని చేస్తుందనే దాని గురించి మరింత తెలుసుకోవచ్చు. మీకు ఈ విధానం గురించి ఏవైనా సందేహాలుంటే, దిగువ వివరించిన పద్ధతులలో మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మా గోప్యతా విధానాలు మరియు పద్ధతులకు సంబంధించి మీకు మాతో ఏవైనా వివాదాలు తలెత్తిన పక్షంలో మేము TrustArc ద్వారా వాటిని పరిష్కరించవచ్చు. మీరు TrustArcని వారి వెబ్‌సైట్ ద్వారా సంప్రదించవచ్చు.
మమ్మల్ని సంప్రదించండి
మీ సమాచార బాధ్యతలు వహించే డేటా కంట్రోలర్ Facebook ఐర్లాండ్, మీరు వారినిఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చుఈ చిరునామాకు మెయిల్ చేయండి:
Facebook ఐర్లాండ్ లిమి.
4 గ్రాండ్ కెనాల్ స్క్వేర్
గ్రాండ్ కెనాల్ హార్బర్
డబ్లిన్ 2 ఐర్లాండ్

Facebook ఐర్లాండ్ లిమిటెడ్ డేటా సంరక్షణ అధికారిని సంప్రదించండి.

మీరు Facebook ఐర్లాండ్‌లో ప్రధాన పర్యవేక్షణ అధికారి అయిన ఐరిష్ డేటా సంరక్షణ విభాగ కమీషనర్ లేదా మీ స్థానిక పర్యవేక్షణ అధికారి దగ్గర ఫిర్యాదు చేసే హక్కుని కూడా కలిగి ఉంటారు.


చివరిగా సవరించిన తేదీ: ఏప్రిల్ 19, 2018