సేవా నిబంధనలు



Facebookకి స్వాగతం!

ఈ నిబంధనలు మీ Facebook వినియోగానికి మరియు మేము అందించే ఉత్పత్తులు, ఫీచర్‌లు, యాప్‌లు, సేవలు, సాంకేతికతలు మరియు సాఫ్ట్‌వేర్‌ను (Facebook ఉత్పత్తులు లేదా ఉత్పత్తులు) మీరు వినియోగించే విధానానికి వర్తిస్తాయి, మేము ప్రత్యేకించి వేరే నిబంధనలు (ఇవి కాకుండా) వర్తిస్తాయని ప్రకటించినప్పుడు మాత్రం ఇవి వర్తించవు.

1. మా సేవలు

మెరుగైన సమాజ స్థాపనకు చేయూతనివ్వడంతోపాటు ప్రపంచ మానవాళిని ఒక్కటి చేయడమే మా లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడటానికి,, మేం క్రింద వివరించిన ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందిస్తాము:
మీ కోసం వ్యక్తిగతీకరించిన అనుభవం అందించబడుతుంది:
Facebookలో మీ అనుభవం మీకంటూ ప్రత్యేకంగా రూపొందిందనే భావన కలిగించేలా ఉంటుంది: మీకు వార్తల ఫీడ్‌లో కనిపించే పోస్ట్‌లు, కథనాలు, ఈవెంట్‌లు, ప్రకటనలు మరియు ఇతరత్రా కంటెంట్ లేదా మీరు అనుసరించే పేజీలకు మేం అందించే వీడియో ప్లాట్‌ఫారం మరియు మీరు ఉపయోగించే జనాదరణ అంశాలు, Marketplace మరియు శోధన వంటి ఇతర విశేషాంశాలు మీ అభిరుచుల మేరకు వ్యక్తిగతీకరించి అందించబడతాయి. మీకు సంబంధించి మా వద్ద ఉండే డేటాను ఉపయోగిస్తాము - ఉదాహరణకు, మీరు ఏర్పరుచుకునే అనుసంధానాలు, మీరు ఎంచుకునే ఎంపికలు మరియు సెట్టింగ్‌లు మరియు మీరు పంచుకునే అంశాలు మరియు మా ఉత్పత్తుల్లో మరియు వెలుపల మీ కార్యకలాపాలు, ఇలాంటి వాటన్నింటి ఆధారంగా మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరిస్తాము.
మిమ్మల్ని మీరు శ్రద్ధ వహించే వ్యక్తులు మరియు సంస్థలతో అనుసంధానిస్తాము:
మీరు ఉపయోగించే Facebook ఉత్పత్తుల వ్యాప్తంగా మీరు ఆసక్తి కనబర్చే వ్యక్తులు, సమూహాలు, వ్యాపారాలు, సంస్థలు మరియు ఇతరత్రా వాటిని కనుగొనడంలో మరియు వారితో/వాటితో అనుసంధానం కావడంలో మీకు సహాయపడతాము. మా వద్ద ఉండే డేటాను ఉపయోగించి మేము మీకు మరియు ఇతరులకు సూచనలు అందిస్తాము - ఉదాహరణకు, గ్రూపుల్లో చేరమనే సూచనలు, ఈవెంట్‌లకు హాజరవ్వమనే సూచనలు, పేజీలను అనుసరించమని లేదా సందేశాలు పంపమని సూచనలు, కార్యక్రమాలు వీక్షించమనే సూచనలు మరియు మీరు స్నేహితులు కావాలని భావించే లాంటి వ్యక్తుల స్నేహ సూచనలు. బలోపేతమైన మానవ సంబంధాలు మెరుగైన సమాజ స్థాపనకు తోడ్పడతాయి, కనుక వ్యక్తులు తాము శ్రద్ధ వహించే వ్యక్తులు, సమూహాలు మరియు సంస్థలతో అనుసంధామైనప్పుడు మా సేవలు అత్యుత్తమ స్థాయిలో సఫలీకృతం అవుతాయని మేము విశ్వసిస్తున్నాము.
మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపర్చగలిగే మరియు మీకు ఆసక్తి ఉన్న అంశాలపై మీ భావాలు/అభిప్రాయాలు పంచుకోగలిగే మరియు చర్చలు చేపట్టగలిగే అధికారం మీకు అందజేస్తుంది:
Facebookలో మీ భావాలను వ్యక్తీకరించడానికి మరియు మీరు శ్రద్ధ కనబర్చే విషయాల గురించి స్నేహితులు, కుటుంబ సభ్యులు మరియు ఇతరులతో పరస్పర భావాలు పంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి - ఉదాహరణకు, మీరు ఉపయోగించే Facebook ఉత్పత్తుల అంతటా స్థితి విశేషాలు, ఫోటోలు, వీడియోలు మరియు కథనాలను పంచుకోవడం, స్నేహితులకు లేదా అనేక మంది వ్యక్తులకు సందేశాలు పంపడం, ఈవెంట్‌లు లేదా సమూహాలను సృష్టించడం లేదా మీ ప్రొఫైల్‌కు కంటెంట్‌ను జోడించడం వంటివి. మేము కూడా జనాల కోసం నేటి సాంకేతికతను అందించపుచ్చుకుంటూ అనేక మార్గాలను అభివృద్ధి చేసాము మరియు వీటిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నాము, ఉదాహరణకు అభివృద్ధి చెందిన సహజ కాల్పనికత మరియు 360 వీడియోలు, వీటి సహాయంతో Facebookలోని కంటెంట్‌ను మరింత భావప్రకాశంగా మరియు ఆకర్షణీయంగా రూపొందించగలరు మరియు పంచుకోగలరు.
మీకు ఆసక్తి అనిపించే కంటెంట్, ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనడానికి మీకు సహాయపడుతుంది:
Facebook మరియు ఇతరత్రా Facebook ఉత్పత్తులు ఉపయోగించే అనేక వ్యాపార రంగాలు మరియు సంస్థల నుండి అందించబడే కంటెంట్, ఉత్పత్తులు మరియు సేవలను కనుగొనడంలో మీకు సహాయపడేందుకు మేము మీకు ప్రకటనలు, ఆఫర్‌లు మరియు ఇతర ప్రాయెజిత కంటెంట్‌ను చూపుతుంటాము. మా భాగస్వాములు వారి కంటెంట్‌ను మీకు చూపేందుకు మాకు డబ్బులు చెల్లిస్తుంటారు మరియు మీకు కనిపించే ప్రాయోజిత కంటెంట్ మా ఉత్పత్తుల్లోని మిగతా వాటి లాగానే సందర్భోచితంగా మరియు ఉపయోగకరంగా ఉండేలా మా సేవలను రూపొందిస్తుంటాము.
హానికర ప్రవర్తనను అడ్డుకోవడంతోపాటు మన సమాజానికి రక్షణను మరియు మద్దతును అందిస్తాము:
తాము సురక్షితంగా ఉన్నట్లు భావించినప్పుడే ప్రజలు Facebookలో సంఘాన్ని రూపొందిస్తారు. మా ఉత్పత్తులు దుర్వినియోగం పాలవుతుంటే గుర్తించడానికి, ఇతరుల పట్ల ద్వేషపూరిత ప్రవర్తనను అడ్డుకోవడానికి మరియు మా సంఘానికి మద్దతు తెలపడంలో లేదా రక్షణ కల్పించడంలో సహాయపడటానికి మేం ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక బృందాలను నియమిస్తుంటాము మరియు అధునాతన సాంకేతికత వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంటాము. మాకు ఇలాంటి కంటెంట్ లేదా ప్రవర్తన గురించి తెలిస్తే, మేము తగిన చర్య తీసుకుంటాము - ఉదాహరణకు, సహాయాన్ని అందించడం, కంటెంట్‌ను తీసివేయడం, నిర్దిష్ట ఫీచర్‌లకి యాక్సెస్‌ను బ్లాక్ చేయడం, ఖాతాను నిలిపివేయడం లేదా చట్ట పరిరక్షణ సంస్థను సంప్రదించడం. మా ఉత్పత్తులు ఉపయోగించే ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడినట్లు లేదా హానికరమైన ప్రవర్తనను కలిగి ఉన్నట్లు గుర్తించినప్పుడు మేము డేటాను ఇతర Facebook కంపెనీలతో పంచుకుంటాము.
అందరికీ సురక్షిత మరియు క్రియాశీల సేవలను అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తాము మరియు అభివృద్ధి చేస్తాము:
మేము కృత్రిమ మేధస్సు, యాంత్రిక అధ్యయన సిస్టమ్‌లు మరియు అభివృద్ధి చెందిన ఆర్గుమెంటెడ్ రియాలిటీ వంటి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తాము, అభివృద్ధి చేస్తాము, వీటి వలన వినియోగదారులు మా ఉత్పత్తులను భౌతికంగా ఉండటం లేదా భౌగోళిక స్థానం వంటివి అవసరం లేకుండానే ఉపయోగించగలరు. ఉదాహరణకు, దృష్టి లోపాలు ఉన్న వ్యక్తులు Facebook లేదా Instagramలో పంచుకోబడిన ఫోటోలు లేదా వీడియోల్లో ఏమి ఉన్నది లేదా ఎవరు ఉన్నది వంటివి అర్థం చేసుకోవడంలో ఇలాంటి సాంకేతికత సహాయపడుతుంది. పరిమిత స్థాయిలో యాక్సెస్ ఉండే ప్రాంతాల్లో ఉంటున్న మరింత మంది వ్యక్తులు ఇంటర్నెట్‌కు అనుసంధానమయ్యేలా చేయడానికి మేం అధునాతన నెట్‌వర్క్ మరియు కమ్యూనికేషన్ సాంకేతికతను కూడా రూపొందించాము. అలాగే, మా ఉత్పత్తుల్లో మా కమ్యూనిటీలు మరియు సమగ్రతకు భంగం కలిగించే దుర్వినియోగ మరియు ప్రమాదకర కార్యాచరణను గుర్తించగల మా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి స్వయంచాలిత వ్యవస్థలను అభివృద్ధి చేసాము.
మా సేవలను మెరుగైనవిగా తీర్చిదిద్దగల మార్గాలపై పరిశోధన:
మేము మా ఉత్పత్తులను మెరుగుపరచడం కోసం వివిధ పరిశోధనలు చేయడంతోపాటు ఇతరులతో కలిసి పని చేస్తాము. ఇలా చేయడం కోసం మా దగ్గర ఉన్న డేటాను విశ్లేషించడం మరియు ప్రజలు మా ఉత్పత్తులను వినియోగిస్తున్న తీరును అర్థం చేసుకోవడమనేది మేము అనుసరించే ఒక మార్గం. మా పరిశోధనా చర్యలలో కొన్నింటి గురించి మీరు మరింత తెలుసుకోవచ్చు.
Facebook సంస్థ ఉత్పత్తులన్నింటిలో స్థిరమైన మరియు నిరంతరమైన అనుభవాలను అందించండి:
వ్యక్తులు, సమూహాలు, వ్యాపారాలు, సంస్థలు మరియు మీకు ముఖ్యమనిపించే వాటిని లేదా వారిని కనుగొని, అనుసంధానించడంలో మా ఉత్పత్తులు మీకు సహాయపడతాయి. మీరు ఉపయోగించే విభిన్న Facebook కంపెనీ ఉత్పత్తులు అన్నింటిలో స్థిరమైన మరియు పొందికైన అనుభవాన్ని పొందేలా మేము మా వ్యవస్థలను రూపొందిస్తాము. ఉదాహరణకు, మీరు Facebookలో మాట్లాడే వ్యక్తులకు సంబంధించిన డేటాను మేము ఉపయోగించడం ద్వారా Instagram లేదా Messengerలో వారితో మీరు సులభంగా అనుసంధానం కాగలిగేలా చేస్తాము, అలాగే మీరు Facebookలో అనుసరించే వ్యాపార సంస్థతో Messenger ద్వారా కమ్యూనికేట్ చేసే సౌలభ్యాన్ని మీకు అందిస్తాము.
మా సేవలకు ప్రపంచవ్యాప్తంగా యాక్సెస్‌ను అనుమతించండి:
మా ప్రపంచవ్యాప్త సేవను అమలు చేయడం కోసం, మేము కంటెంట్ మరియు డేటాను మీ నివాస దేశం వెలుపలి ప్రాంతాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా డేటా కేంద్రాలు మరియు సిస్టమ్‌లలో నిల్వ చేయాలి మరియు పంపిణీ చేయాలి. ఈ మౌలిక సదుపాయం Facebook, Inc., Facebook ఐర్లాండ్ లిమిటెడ్ లేదా దాని అనుబంధ సంస్థలు నిర్వహించవచ్చు లేదా నియంత్రించవచ్చు.

2. మా డేటా విధానం మరియు మీ గోప్యతా ఎంపికలు

మేము ఎగువ వివరించిన సేవలను మీకు అందించే క్రమంలో మీ వ్యక్తిగత డేటాను సేకరిస్తాము మరియు వినియోగిస్తాము. మేము మీ డేటాను సేకరించడం మరియు ఉపయోగించడం గురించి మీరు మా డేటా విధానంలో మరింత తెలుసుకోవచ్చు.
మేము డేటాను ఉపయోగించే మార్గాలకు సంబంధించి మీకు గల గోప్యతా ఐచ్ఛికాలను మీ సెట్టింగ్‌లలో సమీక్షించాల్సిందిగా కూడా మిమ్మల్ని ప్రోత్సహించడమైనది.

3. Facebook మరియు మా సంఘానికి మీ నిబద్ధతాంశాలు

మా లక్ష్యసాధన వైపు మరింత ఎక్కువగా పురోగమించడంలో సహాయపడాలనే ఉద్దేశ్యంతో మీకు మరియు ఇతరులకు ఈ సేవలను అందిస్తాము. మా సేవలకు బదులుగా మీరు క్రింది విషయాలలో నిబద్ధత పాటించాలని కోరుకుంటున్నాము:
1. Facebookను ఎవరు ఉపయోగించవచ్చు
వ్యక్తులు తమ అభిప్రాయాలకు మరియు చర్యలకు బాధ్యత వహించినప్పుడు, మా సంఘం మరింత సురక్షితమైన మరియు విశ్వసనీయమైన వేదికగా నిలుస్తుంది. ఆ కారణం చేత, మీరు తప్పనిసరిగా:
  • మీ దైనందిన జీవితంలో పిలవబడే పేరునే ఉపయోగించండి.
  • మీకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి.
  • కేవలం ఒక్క ఖాతాను(మీ స్వంతది) మాత్రమే సృష్టించండి మరియు మీ టైమ్‌లైన్‌ని వ్యక్తిగత విషయాలను పంచుకోవడం కోసం ఉపయోగించుకోండి.
  • మీ పాస్‌వర్డ్‌ని ఇతరులతో పంచుకోవడం, మీ Facebook ఖాతా యాక్సెస్‌ని ఇతరులకు అందించడం లేదా మీ ఖాతాను వేరొకరికి బదిలీ చేయడం(అనుమతి లేకుండా) వంటివి చేయకూడదు.
ప్రతి ఒక్కరికీ Facebookని అందుబాటులో ఉంచేందుకు మేము కృషి చేస్తున్నాము, కానీ మీరు ఈ విధంగా చేసినట్లయితే Facebookని ఉపయోగించలేరు:
  • మీ వయస్సు 13 ఏళ్లలోపు ఉండటం.
  • మీరు లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిగా గుర్తించబడ్డారు.
  • మీ ఖాతా మా నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించినందున, మేము ముందుగానే దానిని నిలిపివేసాము.
  • వర్తించే నియమాలు ప్రకారం మీరు మా ఉత్పత్తులు, సేవలు లేదా సాఫ్ట్‌వేర్‌‌లను పొందకుండా నిషేధించబడ్డారు.
2. Facebookలో ఏవేవి పంచుకోవచ్చు మరియు చేయవచ్చు
వ్యక్తులు Facebook వేదికగా తమ మనస్సులోని భావాలను వ్యక్తపరచాలని మరియు వారికి సంబంధించి ముఖ్యమైన కంటెంట్‌ను పంచుకోవాలని కోరుకుంటున్నాము, అయితే ఈ క్రమంలో ఇతరుల భద్రత మరియు శ్రేయస్సుకు లేదా మా సంఘం నైతిక సిద్ధాంతాలకు విఘాతం వాటిల్లకూడదు. కాబట్టి మీరు క్రింద వివరించిన విధంగా ప్రవర్తించరని (లేదా ఇతరులకు అలా చేసే అవకాశం కల్పించడం లేదా చేయమని ప్రోత్సహించడం) అంగీకరిస్తున్నారు.
  1. దిగువ పేర్కొన్న విధమైన అంశాలను చేయడానికి లేదా పంచుకోవడానికి మీరు మా ఉత్పత్తులను ఉపయోగించకూడదు:
    • ఈ నిబంధనలు, మా సంఘం ప్రమాణాలు మరియు మీ Facebook వినియోగానికి వర్తించే ఇతర నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘించే అంశాలు.
    • ఇవి చట్టవిరుద్ధమైన, తప్పుదారి పట్టించే, వివక్షత లేదా మోసపూరితమైన అంశాలు.
    • వేరొకరి హక్కులను అతిక్రమించే లేదా ఉల్లంఘించే అంశాలు.
  2. మీరు వైరస్‌లను లేదా హానికరమైన కోడ్‌ని అప్‌లోడ్ చేయకూడదు లేదా మా ఉత్పత్తులను నిలిపివేసేలా, వాటిపై అధికభారం పడేలా లేదంటే పనితీరు లేదా కనిపించే తీరును పాడు చేసేలా ఎలాంటి పనులు చేయకూడదు.
  3. మీరు మా ఉత్పత్తుల నుండి స్వయంచాలక మార్గాల ద్వారా డేటాను సేకరించడం లేదా యాక్సెస్ చేయడం (ముందుగా మా అనుమతి పొందకుండా) లేదా మీకు యాక్సెస్ అనుమతి లేని డేటాను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించడం వంటివి చేయకూడదు.
మీరు పంచుకునే కంటెంట్ ఈ నియమాలను ఉల్లంఘించే పక్షంలో మేము దానిని తీసివేయవచ్చు మరియు క్రింద వివరించిన కారణాల రీత్యా మీ ఖాతాపై చర్య తీసుకోవచ్చు. అలాగే మీరు తరచూ ఇతర వ్యక్తుల మేధోసంపత్తి హక్కులను అతిక్రమించే పక్షంలో, మేము మీ ఖాతాను నిలిపివేయవచ్చు.
సముచితమైన సందర్భాలలో, మా సంఘం ప్రమాణాలను ఉల్లంఘించినందుకు మేము మీ కంటెంట్‌ను తీసివేసేటప్పుడు మీకు తెలియడానికి తగిన చర్యలు తీసుకుంటాము. మేము అన్ని సందర్భాలలో అనగా చట్టప్రకారం మాపై నిషేధం ఉన్నప్పుడు లేదంటే మా సంఘానికి లేదా మా ఉత్పత్తుల నైతికతకు హాని జరిగే అవకాశం ఉన్నప్పుడు మీకు ఎటువంటి నోటీసు ఇవ్వలేకపోవచ్చు.
మా సంఘానికి మద్దతివ్వడంలో సహాయపడేందుకు, మీరు మీ హక్కులను (మేధోసంపత్తి హక్కులతో సహా) లేదా మా నిబంధనలు మరియు విధానాలను ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసించే కంటెంట్‌‌ను నివేదించమని లేదా ప్రవర్తనను నివేదించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.
3. మీరు మాకు అందించే అనుమతులు
మా సేవలను అందించే క్రమంలో మీరు మాకు నిర్దిష్ట అనుమతులను ఇవ్వాలి:
  1. మీరు సృష్టించి భాగస్వామ్యం చేసే కంటెంట్‌ను వినియోగించేందుకు అనుమతి: మీరు Facebookలో మరియు మీరు వినియోగించే ఇతర Facebook ఉత్పత్తుల్లో సృష్టించే మరియు పంచుకునే కంటెంట్‌కు మీరే స్వంతదారు మరియు ఈ నిబంధనల్లో ఏవీ మీ స్వంత కంటెంట్‌కు మీకు గల హక్కులను తీసివేయవు. మీకు నచ్చిన కంటెంట్‌ను ఎవరితో అయినా పంచుకోవచ్చు. మా సేవలను అందించడం కోసం, ఆ కంటెంట్‌ను వినియోగించడానికి మీరు మాకు చట్టపరమైన అనుమతులు ఇవ్వాలి.
    ముఖ్యంగా, మీరు మా ఉత్పత్తులకు సంబంధించిన లేదా మేధోసంపత్తి హక్కులచే (ఫోటోలు లేదా వీడియోలు వంటివి) రక్షించబడిన కంటెంట్‌ను (మీ గోప్యత మరియు అప్లికేషన్ సెట్టింగ్‌లకు అనుగుణంగా ఉన్నది) పంచుకున్నప్పుడు, పోస్ట్ చేసినప్పుడు లేదా అప్‌లోడ్ చేసినప్పుడు మీ కంటెంట్‌ను హోస్ట్ చేయడం, వినియోగించడం, పంపిణీ చేయడం, సవరించడం, అమలు చేయడం, కాపీ చేయడం, పబ్లిక్‌గా నిర్వహించడం లేదా ప్రదర్శించడం, అనువదించడం మరియు దాని నుండి ఉత్పన్నమయ్యే పనులను సృష్టించడానికి మీరు మాకు సాధారణమైన, బదిలీ చేయదగిన, ఉప లైసెన్స్ ఇవ్వదగిన, రాయల్టీ రహిత మరియు ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను అందిస్తున్నారు. ఉదాహరణకు మీరు Facebookలో ఫోటోను భాగస్వామ్యం చేస్తే, దాన్ని నిల్వ చేయడానికి, కాపీ చేయడానికి మరియు మా సేవకు లేదా మీరు ఉపయోగించే ఇతర Facebook ఉత్పత్తులకు మద్దతిచ్చే సేవా ప్రదాతల వంటి ఇతరులతో (ఇక్కడ కూడా మీ సెట్టింగ్‌లకు లోబడి ఉంటూ) పంచుకోవడానికి మాకు అనుమతి ఇస్తున్నారని అర్థం.
    మీరు మీ కంటెంట్‌ను లేదా ఖాతాను తొలగించడం ద్వారా ఎప్పుడైనా ఈ లైసెన్స్‌ను ముగించవచ్చు. సాంకేతిక కారణాల వల్ల మీరు తొలగించే కంటెంట్ బ్యాకప్ కాపీల రూపంలో (అయితే ఇది ఇతర వినియోగదారులకు కనిపించదు) పరిమిత వ్యవధి పాటు అలాగే ఉండవచ్చు. అదనంగా, మీరు తొలగించే కంటెంట్‌ను మీరు ఇతరులకు భాగస్వామ్యం చేసి ఉంటే మరియు వారు దాన్ని తొలగించకుండా అలాగే ఉంచితే అది మీకు కనిపించడం కొనసాగవచ్చు.
  2. మీ పేరు, ప్రొఫైల్ చిత్రం, అలాగే ప్రకటనలు మరియు ప్రాయోజిత కంటెంట్‌తో మీ చర్యల గురించిన సమాచారాన్ని ఉపయోగించడానికి అనుమతి: మేము మీ పేరు మరియు ప్రొఫైల్ చిత్రాన్ని, అలాగే మేము మా ఉత్పత్తుల్లో ప్రదర్శించే ప్రకటనలు, ఆఫర్‌లు మరియు ఇతర ప్రాయోజిత కంటెంట్ పక్కనే లేదా దానికి సంబంధించి Facebookలో మీరు తీసుకున్న చర్యల గురించిన సమాచారాన్ని మీకు ఎటువంటి పరిహారం లేకుండా వినియోగించడానికి మాకు అనుమతి ఇచ్చారు. ఉదాహరణకు, ప్రకటనలో చూపిన ఈవెంట్ పట్ల మీకు ఆసక్తి ఉన్నట్లు లేదా Facebookలో దాని ప్రకటనలను ప్రదర్శించడానికి మేము చెల్లింపును స్వీకరించిన బ్రాండ్ సృష్టించిన పేజీని ఇష్టంగా గుర్తు పెట్టినట్లు మేము మీ స్నేహితులకు చూపవచ్చు. ఇటువంటి ప్రకటనలు మీరు Facebookలో తీసుకున్న చర్యలను చూడటానికి మీ అనుమతి ఉన్న వ్యక్తులకు మాత్రమే కనిపిస్తాయి. మీరు మీ ప్రకటన సెట్టింగ్‌లు మరియు ప్రాధాన్యతల గురించి మరింత తెలుసుకోండి.
  3. మీరు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను నవీకరించడానికి లేదా డౌన్‌లోడ్ చేయడానికి అనుమతి: మీరు మా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేస్తే లేదా వినియోగిస్తే, దాన్ని మెరుగుపరచడానికి, వృద్ధి చేయడానికి మరియు తదుపరి అభివృద్ధి పరచడానికి అప్‌గ్రేడ్‌లు, నవీకరణలు మరియు అదనపు విశేషాంశాలను డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసేందుకు మాకు అనుమతి ఇస్తున్నారు.
4. మేధోపరమైన ఆస్తి వినియోగంపై పరిమితులు
మా ఉత్పత్తులలో ఉన్నటువంటి మేధోపరమైన ఆస్తి హక్కులు వర్తించే కంటెంట్‌ను (ఉదాహరణకు, మీరు Facebookలో సృష్టించే లేదా పంచుకునే కంటెంట్‌కు జోడించేందుకు మేము అందించే చిత్రాలు, డిజైన్‌లు, వీడియోలు లేదా ధ్వనులు) మీరు ఉపయోగిస్తే, మేము ఆ కంటెంట్‌కు (మీది కాదు) అన్ని హక్కులను అలాగే కలిగి ఉంటాము. మా బ్రాండ్ వినియోగ మార్గదర్శకాల ప్రకారం స్పష్టమైన అనుమతి ఉన్నప్పుడు లేదా మా నుండి ముందస్తుగా వ్రాతపూర్వక అనుమతిని పొందినప్పుడు మాత్రమే మా కాపీరైట్‌లు లేదా వ్యాపారచిహ్నాల (లేదా ఏవైనా సారూప్య చిహ్నాల)ను ఉపయోగించవచ్చు. మీరు సవరించడానికి, అనుబంధ రచనలు చేయడానికి, డీకంపైల్ చేయడానికి లేదా మా నుండి సోర్స్ కోడ్‌ను సంగ్రహించేందుకు ప్రయత్నించడానికి తప్పనిసరిగా మా నుండి రాతపూర్వక అనుమతి (ఓపెన్ సోర్స్ లైసెన్స్ క్రింద అందించే అనుమతి) పొంది ఉండాలి.

4. అదనపు నియమాలు

1. మా నిబంధనలను నవీకరించడం
మీకు మరియు మా సంఘానికి మా ఉత్పత్తులను మెరుగైనవిగా చేయడం కోసం మా సేవలను మెరుగుపరచడానికి మరియు కొత్త విశేషాంశాలను అభివృద్ధిపరచడానికి మేము నిరంతరం పని చేస్తుంటాము. ఫలితంగా, మా సేవలు మరియు సాధనాలను ఖచ్చితంగా అందించడానికి మేము కాలానుగుణంగా ఈ నిబంధనలను నవీకరించవలసి ఉంటుంది. చట్ట ప్రకారం అవసరమైతే మాత్రమే, మేము ఈ నిబంధనలకు మార్పులు చేయడానికి కనీసం 30 రోజుల ముందు మీకు తెలియజేస్తాము (ఉదాహరణకు, ఇమెయిల్ ద్వారా లేదా మా ఉత్పత్తులు ద్వారా) మరియు అవి ప్రభావంలోకి వచ్చే ముందు వాటిని సమీక్షించే అవకాశాన్ని మీకు అందిస్తాము. ఏవైనా నవీకరించిన నిబంధనలు అమలులోకి వచ్చాక, మీరు మా ఉత్పత్తులను ఉపయోగించడం కొనసాగిస్తే వాటికి కట్టుబడి ఉండాలి.
మీరు మా ఉత్పత్తులను వినియోగించడం కొనసాగించాలని భావిస్తున్నాము, అయితే మీరు నవీకరించబడిన మా నిబంధనలకు అంగీకరించకుంటే మరియు ఇప్పుడు Facebook సంఘంలో భాగంగా ఉండకూడదనుకుంటే, మీరు ఎప్పుడైనా మీ ఖాతాను తొలగించవచ్చు.
2. ఖాతా తాత్కాలిక నిలిపివేత లేదా రద్దు
ప్రజలు తమ ఆలోచనలను మరియు భావాలను ఎలాంటి భయాలు లేకుండా సురక్షితంగా పంచుకోవడానికి ఒక వేదికగా మేము Facebookని నిలపాలనుకుంటున్నాము.
మీరు మా నిబంధనలు లేదా విధానాలతో పాటు మా సంఘం ప్రమాణాలను పూర్తిగా, ఉద్దేశపూర్వకంగా లేదా పదే పదే ఉల్లంఘిస్తున్నారని మేము భావిస్తే, మీ ఖాతాకి యాస్సెస్‌ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేస్తాము. మేము చట్టప్రకారం అవసరమైతే, మీ ఖాతాని తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా తొలగించడం చేయవచ్చు. సముచితమైన సందర్భాలలో, మీరు మీ ఖాతాని తదుపరి యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు దాని గురించి మీకు తెలియజేస్తాము. మీ ఖాతా నిలిపివేయబడితే మీరు ఏమి చేయవచ్చు, అలాగే ఒకవేళ మేము మీ ఖాతాను పొరపాటున నిలిపివేసామని మీరు భావిస్తే మమ్మల్ని ఎలా సంప్రదించాలనే దాని గురించి మరింత తెలుసుకోండి.
మీరు మీ ఖాతాని తొలగించినా లేదా మేము దానిని నిలిపివేసినా, ఈ నిబంధనలు వర్తించకుండా పోతాయి, అలాగే మీకు మరియు మాకు మధ్య ఉన్న ఒప్పందం రద్దు అవుతుంది, కానీ క్రింది నియమాలు అమలులో ఉంటాయి: 3, 4.2-4.5
3. బాధ్యతపై పరిమితులు
మా ఉత్పత్తులను మీకు అందించడంలో మరియు సురక్షిత, భద్రమైన మరియు దోష రహిత వాతావరణాన్ని కల్పించడంలో మేము తగిన నైపుణ్యాన్ని ఉపయోగిస్తాము మరియు శ్రద్ధను చూపుతాము, అయితే మా ఉత్పత్తులు ఎల్లప్పుడూ ఎటువంటి అంతరాయాలు, కాలయాపనలు లేదా లోపాలు లేకుండా పని చేస్తాయని ఎటువంటి హామీలు ఇవ్వలేము. మేము నైపుణ్యంతో మరియు శ్రద్ధతో పని చేసినప్పటికీ, మేము వీటికి బాధ్యత వహించము: ఈ నిబంధనలను మేము ఉల్లంఘించిన కారణంగా ఏర్పడని లేదంటే మా చర్యల వల్ల ఏర్పడే నష్టాలు; ఈ నిబంధనలకు అంగీకరించే సమయంలో మీరు గానీ మేము గానీ ముందుగా ఊహించని సంభావ్య నష్టాలు; మీకు మా ఉత్పత్తులలో కనిపించే అసహ్యకరమైన, అనుచితమైన, అశ్లీలమైన, చట్టవిరుద్ధమైన మరియు ఇతర అభ్యంతరకరమైన కంటెంట్‌; మరియు మా నియంత్రణ దాటి జరిగే ఈవెంట్‌లు.
ఎగువ పేర్కొన్న విధంగా మరణం, వ్యక్తిగత హాని లేదా మా నిర్లక్ష్యం వల్ల జరిగిన మోసపూరిత అవాస్తవ సూచనకు సంబంధించి మా బాధ్యతను మినహాయించదు లేదా పరిమితం చేయదు. అలాగే ఇది ఆ విధంగా చేయడానికి చట్టప్రకారం అనుమతి లేని ఏవైనా ఇతర విషయాలపై మా బాధ్యతను మినహాయించదు లేదా పరిమితం చేయదు.
4. వివాదాలు
మీకు మాకు మధ్య తలెత్తే వివాదాలను పరిమితం లేదా పూర్తిగా నివారించడానికి మేము స్పష్టమైన నియమాలను అందించడానికి ప్రయత్నిస్తాము. అయినప్పటికీ ఏదైనా వివాదం తలెత్తితే, దాన్ని ఎక్కడ పరిష్కరించుకోవాలి మరియు దానికి వర్తించే నియమాల గురించి ముందుగా తెలుసుకోవడం సహాయకరంగా ఉంటుంది.
మీరు వినియోగదారు అయితే మరియు యురోపియన్ యూనియన్‌లోని రాష్ట్రంలో నివసిస్తున్నట్లయితే, ఈ నిబంధనలు లేదా Facebook ఉత్పత్తుల ("క్లెయిమ్") కారణంగా లేదా వాటికి సంబంధించి మాకు వ్యతిరేకంగా మీరు వేసిన దావా, చర్య తీసుకోవడానికి గల కారణం లేదా వైరుధ్యానికి ఆ రాష్ట్రంలోని చట్టాలు వర్తిస్తాయి, అలాగే మీరు ఆ రాష్ట్రంలో దావాపై వర్తించే అధికార పరిధి గల ఏదైనా సమర్థ న్యాయస్థానంలో మీ దావాను పరిష్కరించుకోవచ్చు. మిగతా అన్ని సందర్భాల్లో, దావా రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్‌లోని సమర్థ న్యాయస్థానంలో రాష్ట్ర న్యాయస్థానంలో పరిష్కరించబడుతుందని, అలాగే చట్టపరమైన నియమాల వైరుధ్యంతో సంబంధం లేకుండా ఈ నిబంధనలను మరియు ఏదైనా దావాను ఐరిష్ చట్టం నిర్వహిస్తుందని అంగీకరిస్తున్నారు.
5. ఇతరం
  1. ఈ నిబంధనలు (పూర్వం హక్కులు మరియు బాధ్యతల ప్రకటనగా పిలువబడేది) మా ఉత్పత్తులను ఉపయోగించే విధానానికి సంబంధించి మీకు మరియు Facebook ఐర్లాండ్ లిమిటెడ్‌కి మధ్యన వర్తించే సమగ్ర ఒప్పందం. ఇంతకు ముందు ఒప్పందాలు ఏవైనా ఉంటే వాటి స్థానంలో ఈ నిబంధనలు అమలులోకి వస్తాయి.
  2. మేము అందించే కొన్ని ఉత్పత్తులు అనుబంధనిబంధనలు ద్వారా కూడా నిర్వహించబడతాయి. మీరు అలాంటి ఉత్పత్తుల్లో దేనినైనా ఉపయోగిస్తే, వాటి అనుబంధ నిబంధనలకు మీ అంగీకారం తెలియజేయమని కోరుతాము, మీరు అంగీకరిస్తేనే అవి మాకు మీతో ఉన్న ఒప్పందంలో భాగమవుతాయి. ఉదాహరణకు, ప్రకటనలను కొనుగోలు చేయడం, ఉత్పత్తులను విక్రయించడం, యాప్‌లను రూపొందించడం, మీ వ్యాపారం కోసం ఒక గ్రూపు లేదా పేజీని నిర్వహించడం లేదా మా లెక్కింపు సేవలను వినియోగించడం వంటి వాణిజ్య లేదా వ్యాపార ప్రయోజనాల కోసం మా ఉత్పత్తులను మీరు యాక్సెస్ చేసినా లేదా వినియోగించినా, తప్పనిసరిగా మా వాణిజ్య నిబంధనలు అంగీకరించాలి. మీరు సంగీతం ఉన్న కంటెంట్‌ని పోస్ట్ చేసినా లేదా పంచుకున్నా, తప్పనిసరిగా సంగీత మార్గదర్శకాలకు లోబడి ఉండాలి. అనుబంధ నిబంధనలు మరియు ఈ నిబంధనల మధ్య వైరుధ్యం ఏర్పడినప్పుడు, ఆ వైరుధ్యాన్ని పరిష్కరించడానికి అనుబంధ నిబంధనలు వర్తిస్తాయి.
  3. ఈ నిబంధనలలో ఏవైనా కొన్ని అమలు కాదగినవిగా కనుగొనబడితే, మిగిలినవి పూర్తి స్థాయిలో అమలవుతాయి. మేము ఈ నిబంధనలలో వేటినైనా అమలు చేయడంలో విఫలమైతే, వాటిని విడిచిపెట్టినట్లుగా పరిగణించబడవు. ఈ నిబంధనలకు ఏవైనా సవరణలు చేయాలనుకున్నా లేదా విడిచిపెట్టాలని అనుకున్నా తప్పనిసరిగా మేము రాతపూర్వకంగా సంతకం చేసి ఆమోదించాలి.
  4. మీరు ఈ నిబంధనల క్రింద మీ హక్కులు లేదా బాధ్యతలు వేటిని మా సమ్మతి లేకుండా వేరొకరికి బదిలీ చేయకూడదు.
  5. మీ ఖాతా స్మారకంగా మార్చబడితే, దానిని నిర్వహించడానికి మీరు ఒక వ్యక్తిని (ఉత్తరాధికార వ్యక్తి అని పిలువబడతారు) నియమించవచ్చు. కేవలం మీరు ఉత్తరాధికారిగా నియమించినవారు లేదా మీ మరణానంతరం లేదా అశక్తులైనప్పుడు మీ కంటెంట్ గురించి వెల్లడించడానికి ప్రామాణిక వీలునామా లేదా సారూప్య పత్రంలో స్పష్టమైన సమ్మతి ఇవ్వబడినట్లుగా గుర్తించిన వ్యక్తి మీ ఖాతా స్మారకంగా గుర్తించిన తర్వాత మీ ఖాతా నుండి సమాచార వెల్లడి కోరవచ్చు.
  6. ఈ నిబంధనలు మూడవ-పక్ష లబ్ధిదారుల హక్కులు ఏవీ అందించవు. ఈ నిబంధనల క్రింద మా హక్కులు మరియు బాధ్యతలన్నీ ఆస్తుల విలీనం, ఆర్జన లేదా విక్రయాలకు సంబంధించి లేదా చట్టప్రకారంగా లేదా వేరొక విధంగా నిర్వహణ ద్వారా మాచే సులభంగా కేటాయించబడతాయి.
  7. మేము నిర్ధిష్ట సందర్భాలలో (ఉదాహరణకు, ఎవరైనా ఒక వినియోగదారు పేరుని క్లెయిమ్ చేసుకున్నాక అది దైనందిన జీవితంలో ఉపయోగించే పేరుకి సంబంధితంగా లేనప్పుడు) మీ ఖాతా వినియోగదారు పేరును మార్చాల్సి రావచ్చని మీరు గమనించాలి.
  8. మేము మీ అభిప్రాయానికి మరియు మా ఉత్పత్తులు మరియు సేవల గురించి మీరిచ్చే ఇతరత్రా సూచనలకు ఎల్లప్పుడూ విలువిస్తాము. కానీ మేము వాటిని మీకు ఏ విధమైన చెల్లింపులు చేయకుండా ఉపయోగించవచ్చని మరియు వాటిని రహస్యంగా ఉంచాల్సిన బాధ్యత ఏదీ మాపై ఉండదని మీరు గమనించగలరు.
  9. మీకు నిర్దిష్టంగా మంజూరు చేసినవి మినహా మిగతా అన్ని హక్కులు మా స్వంతం.

5. మీకు వర్తించే అవకాశం ఉన్న ఇతర నిబంధనలు మరియు విధానాలు

  • సంఘం ప్రమాణాలు: ఈ మార్గదర్శకాలు మీరు Facebookలో పోస్ట్ చేసే కంటెంట్, అలాగే Facebook మరియు ఇతర Facebook ఉత్పత్తులలో మీ కార్యాచరణకు సంబంధించిన మా ప్రమాణాలను వివరిస్తాయి.
  • వాణిజ్య నిబంధనలు: మీరు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం, మా ప్లాట్‌ఫారమ్లో యాప్‌ను అమలు చేయడం, మా అంచనా సేవలను ఉపయోగించడం, వ్యాపారం కోసం సమూహాన్ని లేదా పేజీని నిర్వహించడం లేదంటే వస్తువులు లేదా సేవలను విక్రయించడంతో సహా ఏదైనా వాణిజ్యపరమైన లేదా వ్యాపారపరమైన ప్రయోజనం కోసం మీరు మా ఉత్పత్తులను యాక్సెస్ చేసినా లేదా వినియోగించినా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  • ప్రకటన విధానాలు: Facebook ఉత్పత్తులలో ప్రకటనలు ఇచ్చే భాగస్వాములు ఏ రకాల ప్రకటన కంటెంట్‌ను అనుమతిస్తారనే దాన్ని ఈ విధానాలు పేర్కొంటాయి.
  • స్వీయ-సేవ ప్రకటన నిబంధనలు: మీరు ఏదైనా ప్రకటన లేదా ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కార్యాచరణ లేదా కంటెంట్‌ను సృష్టించడానికి, సమర్పించడానికి లేదా అందించడానికి స్వీయ-సేవ ప్రకటన ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించినప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  • పేజీలు, సమూహాలు మరియు ఈవెంట్‌ల విధానం: మీరు Facebook పేజీ, సమూహం లేదా ఈవెంట్‌ను సృష్టించినా లేదా నిర్వహించినా లేదంటే ప్రచారాన్ని కమ్యూనికేట్ చేయడానికి లేదా నిర్వహించడానికి Facebookని ఉపయోగించినా ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి.
  • Facebook ప్లాట్‌ఫారమ్ విధానం: మీరు మా ప్లాట్‌ఫారమ్ను (ఉదాహరణకు, ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్ డెవలపర్లు లేదా ఆపరేటర్ల కోసం లేదంటే మీరు సోషల్ ప్లగిన్‌లను ఉపయోగిస్తే) వినియోగించే తీరుకి వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.
  • డెవలపర్ చెల్లింపుల నిబంధనలు: ఈ నిబంధనలు Facebook చెల్లింపులను ఉపయోగించే అప్లికేషన్‌లకు వర్తిస్తాయి.
  • సంఘం చెల్లింపుల నిబంధనలు: ఈ నిబంధనలు Facebookలో లేదంటే Facebook ద్వారా జరిగే చెల్లింపులకు వర్తిస్తాయి.
  • వాణిజ్య విధానాలు: మీరు Facebookలో విక్రయించడం కోసం ఉత్పత్తులు మరియు సేవలను ఉంచినప్పుడు వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.
  • Facebook బ్రాండ్ వనరులు: ఈ మార్గదర్శకాలు Facebook వ్యాపారచిహ్నాలు, లోగోలు మరియు స్క్రీన్‌షాట్‌ల వినియోగానికి వర్తించే విధానాలను వివరిస్తాయి.
  • సంగీత మార్గదర్శకాలు: మీరు Facebookలో సంగీతాన్ని కలిగి ఉన్న కంటెంట్‌ను పోస్ట్ చేసినప్పుడు లేదా పంచుకున్నప్పుడు వర్తించే విధానాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయి.

చివరి సవరణ తేదీ: ఏప్రిల్ 19, 2018